Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజుకు సెగ.. గడపగడపలో ఏం జరిగిందంటే!
By: Tupaki Desk | 13 Dec 2022 9:00 PM ISTఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపు మేరకు ఆపార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చాలా చోట్ల ఈ కార్యక్రమా నికి వెళ్తున్న ఎమ్మెల్యేలకు సెగ తగులుతోంది. స్థానికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాలని.. అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలోఎమ్మెల్యేల దురుసు ప్రవర్తన.. ప్రజలను బాధిస్తోంది.
దీంతో ప్రజలు వారికి నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా.. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు కూడా ప్రజల నుంచి తీవ్ర సెగ తగిలింది. అయితే.. ఇందులో ఆయన తప్పు లేకపోయినా.. నోరు జారిన తన పార్టీ నాయకుడిని నిలువరించకపోవడమే కారణం. దీంతో ప్రజలు ఆయనను తీవ్రంగా ఘెరావ్ చేశారు.
ఏం జరిగిందంటే..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. తన నియోజకవర్గంలోని ఆర్ ఆర్ వెంకటాపురం లో అదీప్ రాజు తన అనుచరులు.. ఇతర నేతలతో కలిసి గడప.. గడపలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఒక సమస్యను వివరించారు. ``మా ఇళ్లమీద నుంచి హైటెన్షన్ విద్యుత్ వైర్లు వెళ్తున్నాయి. వాటితో మా ప్రాణాలకు ప్రమాదం ఉంది. భయం భయంగా బతుకుతున్నాం. వాటిని తొలగించండి`` అని అభ్యర్థించారు.
ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన అదీప్ రాజు.. సదరు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, ఇంతలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు, 94వ వార్డు అధ్యక్షుడు ఆదిరెడ్డి మురళినోరు పారేసుకున్నారు. ``హైటెన్షన్ వైర్ల బదులు మీ ఇళ్లు తీయించేస్తే.. ఏగోలా ఉండదు`` అని వ్యాఖ్యానించారు.
దీంతో స్థానికులు ఒక్కసారిగా మండిపడ్డారు. వైర్లు తీయించమంటే మా ఇళ్లు కూల్చేస్తామంటావా? అంటూ.. నిప్పులు చెరిగారు. అయితే.. తన అనుచరుడు ఇలా నోరు పారేసుకున్నప్పటికీ.. ఎమ్మెల్యే అదీప్ మాత్రం కనీసం ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. తన మానాన తను సైలెంట్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రజలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.