Begin typing your search above and press return to search.
ట్రంప్ హయాంలో మరో చెత్త రికార్డు నమోదు
By: Tupaki Desk | 17 Jan 2021 9:42 AM ISTసంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ట్రంప్ సర్కారు.. మరణ శిక్షల అమలు విషయంలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. గతంలో మరే అధ్యక్షుడి హయాంలోనూ లేని రీతిలో తన నాలుగేళ్ల పదవీ కాలంలో అత్యధికంగా పదమూడు మందికి విషపు ఇంజెక్షన్ పద్దతిలో మరణశిక్షల్ని అమలు చేశారు. మరణశిక్షల అమలు విషయంలో అమెరికాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. ట్రంప్ వెనక్కి తగ్గకుండా మరణశిక్షల్ని నిర్మోహమాటం లేకుండా అమలు చేయించారు.
మరింత ఆసక్తికకరమైన విషయం ఏమంటే.. మరణశిక్షల్ని తీవ్రంగా వ్యతిరేకించే బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా.. తనకున్న విశేష అధికారాలతో మరణశిక్షల్ని అమలు చేయించిన ఘనత ట్రంప్ కే చెల్లుతుంది. కేవలం ఏడాది వ్యవధిలోనే పదమూడు మంది నేరస్థులకు ఫెడరల్ అధికారులు మరణశిక్షను అమలు చేయటం గమనార్హం.
అమెరికా చట్టాల ప్రకారం మరణశిక్షల్ని ఫెడరల్ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాలు అమలు చేస్తుంటాయి. అయితే.. గడిచిన పదిహేడు సంవత్సరాలుగా మరణశిక్షల్ని అమలు చేయలేదు. అయితే.. ట్రంప్ మాత్రం మరణశిక్షల అమలులో కఠిన విధానాన్ని అమలు చేసేందుకు ఓకే చేశారు. దీంతో.. ఫెడరల్ అధికారులు ఏడాదిలో ఏకంగా పదమూడు మందికి మరణశిక్షల్ని అమలు చేశారు. 1996లో ముగ్గుర్ని హత్య చేసిన కేసులో హిగ్స్ అనే దోషిని 2001లో మరణశిక్షను అమలు చేశారు.
అప్పటి నుంచి మరణశిక్షల అమలును నిలిపివేస్తూ 2003లో అమెరికా నిర్ణయం తీసుకుంది. ట్రంప్ పుణ్యమా అని.. పెద్ద ఎత్తున మరణశిక్షల్ని అమలు చేశారు.కొద్ది రోజుల క్రితమే మహిళ గర్భాన్ని కోసి బిడ్డను అపహరించిన కేసులో లీసాకు మరణశిక్షను అమలు చేశారు.రానున్న రోజుల్లో మరణశిక్షపై ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.