Begin typing your search above and press return to search.

మెహుల్‌ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇవ్వడానికి డొమినికా కోర్టు నిరాకరణ !

By:  Tupaki Desk   |   12 Jun 2021 6:30 AM GMT
మెహుల్‌ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇవ్వడానికి డొమినికా కోర్టు నిరాకరణ !
X
ప్రముఖ వజ్రాల వ్యాపారి , పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన మెహుల్‌ చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు అంగీకరించలేదు. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకోలేదు. తన సోదరుడితో కలిసి ఉంటానని కోర్టుకు తెలుపగా.. అది స్థిర నివాసం కాదని పేర్కొంది.చోక్సీపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని గుర్తించిన కోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్నత తర్వాత న్యాయమూర్తి బెయిల్‌ ఇవ్వకూడదని నిర్ణయించారు. బెయిల్‌ కోసం కోర్టు ఎదుట బలమైన పూచీకత్తును ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆంటిగ్వా న్యూస్‌ రూమ్‌ తెలిపింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ 2018లో భారత్‌ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే. మే 23న విందు కోసం వెళ్లిన చోక్సీ ఆ తర్వాత డొమినికాలో కనిపించాడు. డొమినికాలోకి చోక్సీ అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. ఆంటిగ్వా నుంచి భారత్‌ కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే డొమినికాలో పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే, ఆంటిగ్వా బీచ్‌ నుంచి కిడ్నాప్‌ చేసి డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ ఆరోపించారు. . బెయిల్‌ కోసం కోర్టు ఎదుట బలమైన పూచీకత్తు ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆంటిగ్వా న్యూస్‌ రూమ్‌ పేర్కొంది.