Begin typing your search above and press return to search.

అమ్మాయిల‌తో దావ‌త్‌... రాజ‌కీయ నేత‌ల‌కు డ‌బ్బులు...బ్యాంక్ మోసగాడి షాకింగ్ లైఫ్‌

By:  Tupaki Desk   |   3 Jun 2021 5:30 AM GMT
అమ్మాయిల‌తో దావ‌త్‌... రాజ‌కీయ నేత‌ల‌కు డ‌బ్బులు...బ్యాంక్ మోసగాడి షాకింగ్ లైఫ్‌
X
మెహుల్ చోక్సీ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ స్కాం నిందితుడు. త‌న మేన‌ల్లుడు నీర‌వ్ మోదీతో క‌లిసి రూ.13,500 కోట్ల‌కు మోసం చేసి, 2018లో విదేశాల‌కు పారిపోయిన సంగ‌తి తెలిసిందే. పరారీలో ఉన్న ఆర్థిక నేర‌గాడు మెహుల్ చోక్సీని ర‌క్షించుకునేందుకు ఆయ‌న సోద‌రుడు చేత‌న్ చోక్సీ రంగంలోకి దిగాడు. మెహుల్ చోక్సీని నేరుగా భార‌త్‌కు అప్ప‌గించాల‌న్న పిటిష‌న్‌పై డొమినికా కోర్టులో విచార‌ణ జరుగుతున్న రోజే ఆ దేశంలో అడుగు పెట్టాడ‌ని ఆ దేశ మీడియాలో వార్త‌లొచ్చాయి. అయితే, ఇక్క‌డే సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

హాంకాంగ్ మీదుగా డొమినికాకు చేరుకున్న చేత‌న్ చోక్సీ.. త‌న సోద‌రుడు మెహుల్ పెట్టిన జైలుకు వెళ్లారు. అనంత‌రం డొమినికా దేశ ప్ర‌తిపక్ష నేత లెనాక్స్ లింట‌న్‌తో చేత‌న్ చోక్సీ స‌మావేశ‌మైన‌ట్లు తెలిసింది. నేరుగా భార‌త్‌కు మెహుల్‌ను అప్ప‌గించ‌కుండా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న‌ను చేత‌న్ కోరిన‌ట్లు స‌మాచారం. డొమినికా విప‌క్ష నేత‌కు చేత‌న్ భారీగా ముడుపులు చెల్లించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఎపిసోడ్ అనంత‌రం కీల‌క ప‌రిణామం జ‌రిగింది. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల పొడ‌వునా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్య‌క్తుల కిడ్నాప్‌కు డొమినికా ప్ర‌భుత్వం స‌హ‌క‌రించడం ఆమోద‌యోగ్యం కాద‌ని లెనాక్స్ లింట‌న్ ఆరోపించారు.

మెహుల్ చోక్సీని నేరుగా భార‌త్‌కు అప్ప‌గించ‌బోమ‌ని అంటిగ్వా-బార్బుడా, డొమినికా దేశాల విప‌క్ష నేత‌లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం చోక్సీ సోద‌రుడు డ‌బ్బులు వెద‌జ‌ల్ల‌డ‌మ‌ని అంటున్నారు. హాంకాంగ్ నుంచి వ‌స్తూనే భారీగా రెండు ల‌క్ష‌ల డాల‌ర్ల సొమ్ము వెంట తెచ్చుకున్నాడ‌ని మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయి. కాగా, త‌న ప్రేయ‌సితో జ‌ల్సా చేస్తున్న టైంలోనే చోక్సి డొమినికాలో అరెస్టైన సంగ‌తి తెలిసిందే.