Begin typing your search above and press return to search.
ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం .. విజయవాడ యువతి హత్య కేసులో మరో ట్విస్ట్ !
By: Tupaki Desk | 16 Oct 2020 4:00 PM ISTవిజయవాడ ప్రేమోన్మాది చేతిలో హతమైన యువతీ హత్య కేసులో గంటకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ హత్య కేసులో నిందుతుడు నాగేంద్ర స్టేట్ మెంట్ ని పోలీసులు శుక్రవారం ఉదయం హాస్పిటల్ లో రికార్డ్ చేశారు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇద్దరం కలిసి ఆత్మహత్యకు పూనుకున్నామని నాగేంద్ర పోలీసులకి చెప్పినట్టు తెలుస్తుంది. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం ఆ అమ్మాయి నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. ఆ యువతి బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు అని నాగేంద్ర చెప్పాడు.
ప్రేమను నిరాకరించినందుకే యువతిని నాగేంద్రబాబు చంపాడని మొదట ప్రచారం సాగింది. అయితే వారిద్దరూ కలిసి ఉన్న చిత్రాలు సాయంత్రానికల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. నాగేంద్రబాబు స్నేహితుల్ని, స్థానికుల్ని పోలీసులు విచారించగా.. వారిద్దరికీ వివాహమైందని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ వివాహం విషయాన్ని యువతి తల్లిదండ్రులు ఖండించారు. నాగేంద్రబాబు ఎవరో తమకు, తమ కుమార్తెకు తెలియదని వాపోయారు. అవి నకిలీ చిత్రాలు అయ్యుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిందుతుడు కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. దీనికి తోడు ఇప్పుడు నిందుతుడు ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకి మరో ట్విస్ట్ ఇచ్చింది. దీనితో ఈ కేసులో అసలు నిజా నిజాలేవో పోలీసులే విచారణలో బయటపెట్టాలి.