Begin typing your search above and press return to search.
ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్ !
By: Tupaki Desk | 2 March 2020 12:45 PM ISTకరీంనగర్ జిల్లా విద్యానగర్ లో గత నెల 10 వ తేదీన ఇంటర్ విద్యార్థిని రాధిక ఇంట్లోనే అతి కిరాతకంగా హత్యకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగుడు రాధిక గొంతుకోసి కిరాతకం గా హత్య చేసారు. ఆ తరువాత ఎటువంటి క్లూ లేకుండా కేసు విచారణ చేపట్టిన పోలీసులకి ఈ కేసుపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఈ మిస్టరీ కేసు విచారణ చేపట్టిన పోలీసులు, ఈ కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధికను కుటుంబ సభ్యులే గొంతు కోసి చంపినట్లు అనుమానిస్తున్నారు.
అసలేమైందంటే ... ఫిబ్రవరి 10న ఇంట్లోనే రాధిక దారుణ హత్య కు గురైంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ హత్య జరిగింది. ఆ సమయంలో కూలి పనుల కోసం బయటకు వెళ్లామని రాధిక తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు. పక్కింట్లోని తొమ్మిదేళ్ల పిల్లాడు, ఆ ఇంటికి రావడంతో, రాధిక మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాధికను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో అద్దెకు ఉండే కుర్రాడు... కొంతకాలంగా రాధిక వెంట పడుతున్నాడని, అతడే చంపి ఉంటాడని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు చేశారు.
ఈలోగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా, పోస్టుమార్టం రిపోర్ట్ పరిశీలిస్తే... కుటుంబ సభ్యులే ఆమెను చంపేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కుటుంబసభ్యులలో ఎవరో ఒకరు రాధికను చంపి ఉంటారని... అనుకుంటున్న పోలీసులు, తాజాగా... రాధిక తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఆ ఇంట్లో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాధిక తండ్రి కొమురయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనితో ఈ కేసులో తండ్రే హంతకుడా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈ కేసు విచారణలో నిందితులు ఎవరో తెలియకపోవడంతో పోలీసులు జర్మన్ ఫోరెన్సిక్ టెక్నాలజీ ని ఆశ్రయించారు. ఈ ఫోరెన్సిక్ టెక్నాలజీ ద్వారానే ఈ కేసులోని కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది.