Begin typing your search above and press return to search.

సాఫ్ట్‌వేర్ శ్వేత ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

By:  Tupaki Desk   |   22 Oct 2020 5:40 PM IST
సాఫ్ట్‌వేర్  శ్వేత ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
X
హైదరాబాద్‌ కి చెందిన సాప్ట్ ‌వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు అజయ్ వేధింపులతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. శ్వేత కుటుంబ సభ్యులు ఆరోపణలతో అజయ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అజయ్ వల్లే శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. తాజాగా ఈ కేసు లో మరో కొత్త కోణం వెలుగు లోకి వస్తుంది. శ్వేత, ప్రియుడు అజయ్ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టినట్లు విచారణ లో తెలిసింది.

శ్వేత నుండి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పాస్ వర్డ్ తీసుకొని అప్లోడ్ చేసినట్లు అజయ్ పోలీస్‌ల ముందు ఒప్పుకున్నాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినందుకు నాపై కేసు పెట్టారు.. నాపై కేసు పెట్టడంతో శ్వేతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను అని అజయ్ పోలీస్ లతో చెప్పినట్టు తెలుస్తుంది. శ్వేత ఆత్మహత్య కేసులో అజయ్ పై అనుమానం ఉందంటున్న మృతురాలి తల్లిదండ్రులు అజయ్ తన కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

గత నెల 18న ఇంటి నుండి అదృశ్యమైన శ్వేత.. అర్థరాత్రి బీబీనగర్ సమీపంలోని NFC నగర్ రైలు పట్టాలుపై శవంలా కనిపించింది. ఆత్మహత్య, హత్య అనే కోణంలో నడుస్తోన్న పోలీస్ విచారణ కొనసాగుతోంది. మా శ్వేతను అజయ్‌ చంపాడు.. పోలీసుల అలసత్వం ఉందంటూ తల్లిదండ్రులు వారిస్తున్నారు. అజయ్ వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని శ్వేత పేరంట్స్ చెబుతున్నారు. వారు స్పందించకపోవడంతో దారుణం జరిగిందని తెలిపారు. కానీ శ్వేత పేరంట్స్ ఆరోపణలపై సంబంధిత పోలీసులు స్పందించలేదు.