Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్.. హైకోర్టుకు రమేశ్

By:  Tupaki Desk   |   3 Sept 2020 9:00 AM IST
నిమ్మగడ్డ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్.. హైకోర్టుకు రమేశ్
X
ఏపీ ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వంతో ఫైట్ చేసి మరీ నియామకమైన నిమ్మగడ్డ రమేశ్ మరోసారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎస్ఈసీ స్వతంత్రతను అణిచివేసేలా సర్కార్ ప్రయత్నిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. తమ సిబ్బందిపై సీఐడీ నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమని.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

తాజాగా ఏపీ సీఐడీ అధికారులు ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్ ను అందులోని డేటాను తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటీషన్ లో ప్రస్తావించారు. తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంపై సీఐడీ అధికారులు ఆరాతీశారని.. సాంబమూర్తిని వేధించి సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు.

ఇక బాధిత ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరారు.

దీంతో ఈ రెండు పిటీషన్లను కలిపి విచారణ జరుపుతామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. గతంలో నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై సీఐడీ ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోంది.