Begin typing your search above and press return to search.
దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం .. తోలిరోజే చంపేసిన కిడ్నాపర్లు , వెలుగులోకి మరో ట్విస్ట్ !
By: Tupaki Desk | 22 Oct 2020 3:20 PM ISTమహబూబాబాద్ లో కిడ్నాప్‌కి గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కేసు విషాదంగా ముగిసింది. బాబును క్షేమంగా వదిలిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు అడిగితే , వారు అడిగిన డబ్బును ఇస్తామని చెప్పినా బాబుని చంపేయడం తో దీక్షిత్ మరణవార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కిడ్నాప్ చేసిన మొదటిరోజే ఆ పిల్లవాడిని చంపేశారు. కిడ్నాప్ చేసిన రోజు దీక్షిత్ భయంతో కేకలు పెట్టడం, ఏడుపు ఆపకపోవడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత స్లీపింగ్స్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొంతు నులిమి చంపేశారు. కిడ్నాప్‌కు సూత్రధారుడు మనోజ్ రెడ్డి తో పాటు మరో ముగ్గురి ని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. మంద సాగర్ అనే వ్యక్తి తో కలిసి బాలుడిని హత్య చేసినట్లు గా తెలుస్తోంది. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరం లోని గుట్ట లో బాలుడి మృత దేహం లభించింది.
పూర్తి వివరాలు చూస్తే .. మహబూబాబాద్ కృష్ణా కాలనీకి చెందిన రంజిత్, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా గత ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు బైక్ పై వచ్చి కిడ్నాప్ చేశారు. రాత్రి అయినా పిల్లాడు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతుకగా ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లాడని తోడి స్నేహితులు చెప్పారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మంగళవారం రాత్రి కిడ్నాపర్లు మరోసారి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు తెలుస్తుంది. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని వచ్చి తీసుకుంటామని చెప్పారు.
అయితే, వారితో పాటుగా పోలీసులు కూడా వెళ్లారు. ఇది గమనించిన కిడ్నాపర్లు ఫోన్ చేసిన కిడ్నాపర్లు పోలీసుల్ని వెనక్కు పంపించాలని వార్నింగ్ ఇచ్చారు. పిల్లాడిని ఏమైనా చేస్తారేమోనని భయపడిన రంజిత్ రెడ్డి వాళ్లు చెప్పినట్టే పోలీసుల్ని పంపేశారు. తర్వాత కిడ్నాప్ గ్యాంగ్ మరో ప్లేస్ కు రావాలని సూచించింది. అక్కడకు వెళ్లాక కాల్ చేసి డిస్కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ఏమైందో తెలియక అంతా టెన్షన్‌లో ఉన్నారనగా.. సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. అయితే , డబ్బును చూడటానికి కిడ్నాపర్లు స్కైప్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే కిడ్నాపర్లు ఉండే ప్రాంతాన్ని గుర్తించి తెల్లవారుజామున 3 గంటలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక చిన్నారిని అన్యాయంగా బలితీసుకున్నారు. నాలుగు రోజులుగా బిడ్డ తిరిగి వస్తాడని ఆశగా తల్లిదండ్రులు ఎదురుచూసిన ఆ తల్లి ఇక తన బిడ్డ లేడు అని తెలియడంతో శోక సంద్రంలో మునిగిపోయింది.
నిందితుడు దీక్షిత్ తండ్రి రంజిత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది.నిందితుడు పక్కాగా బాలుడ్ని కిడ్నాప్ చేయించి , రంజిత్ నివాసం దగ్గర జరిగే సీనంతా ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు చేరవేశాడు. పోలీసుల కదలికల్ని వాచ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా తన కిడ్నాప్ ముఠాకు చేరవేశాడు. అయితే ఆ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని ఏ నిమిషంలో కూడా రంజిత్ కుటుంబం అనుమానించ లేకపోయింది. ఎందుకంటే రంజిత్‌రెడ్డికి అతను అత్యంత సన్నిహితుడు కావడమే. మరోవైపు కిడ్నాప్ గ్యాంగ్‌లో ఉన్న ఆ నలుగురు ఎవరు, లోకల్‌గా ఉండేవాళ్లేనా, లేదంటే ప్రొఫెషనల్ కిడ్నాపర్ల అన్నది తేలాల్సి ఉంది. కిడ్నాప్ ఎపిసోడ్ ని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. బాలుడ్ని కిడ్నాపర్ ఎక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లాక ఏం చేశాడు. దీక్షిత్ తల్లిదండ్రులకి ఎక్కడెక్కడినుంచి ఎలా కాల్ చేశాడనే వివరాలను సేకరించారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు పోలీసులు మీడియా ముందు వెల్లడించనున్నారు.