Begin typing your search above and press return to search.

అమరావతి కుంభకోణం: సీఐడీ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   3 Feb 2020 10:46 AM IST
అమరావతి కుంభకోణం: సీఐడీ సంచలన నిర్ణయం
X
అమరావతిలో భూముల కొనుగోళ్ల విషయంలో సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ ముమ్మరం చేసింది. నాలుగు వేల ఎకరాల్లో భూముల కొనుగోలు అక్రమాలు జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ జరుపుతోంది.

రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులతోపాటు రాజకీయ నాయకులపై విచారణ చేస్తోంది. తాజాగా తెల్ల రేషన్ కార్డులపై కేసులు కూడా నమోదు చేసింది. 790 మంది తెల్ల రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.

అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్ల రేషన్ కార్డు దారులు రూ.3 కోట్ల చొప్పున భూముల్ని కొనుగోలు చేసినట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. దీనికోసం ఏకంగా నాలుగు స్పెషల్ టీంలను రంగంలోకి దించారు. మొత్తం 796 రేషన్ కార్డు దారులు రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు సీఐడీ గుర్తించినట్టు తెలిసింది. తెల్లరేషన్ కార్డుదారులలో ఎవరు భూములు కొనుగోలు చేయించారనే అంశం పై ప్రధానం గా ఫోకస్ పెట్టినట్టు గా తెలుస్తోంది.

ఇక బినామీల ముసుగులో అమరావతిలో భూములు కొన్న, స్వయంగా కొనుగోలు చేసిన ఇద్దరు మాజీ మంత్రులపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన సీఐడీ ఈ మేరకు అమరావతి భూముల కొనుగోలు పై విచారణ చేయాలంటూ ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి కి లేఖ రాసింది. రెండు రోజుల్లో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది.