Begin typing your search above and press return to search.

మోడీకి మరో టఫ్ పరీక్ష

By:  Tupaki Desk   |   9 Jan 2020 4:46 PM IST
మోడీకి మరో టఫ్ పరీక్ష
X
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఓ వైపు తరుముకొస్తున్న ఆర్థికమాంద్యం.. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత.. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ మరో టఫ్ పరీక్షను ఎదుర్కోబోతున్నారు.

అదే బడ్జెట్.. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను మోడీసార్ ఎలా కుదుటపరుస్తాడన్నది ఇప్పుడు అంతుచిక్కని వ్యవహారంగా ఉంది. ఫిబ్రవరి1న పార్లమెంట్ లో మోడీ సర్కార్ రెండోసారి గద్దెనెక్కాక పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ ను మోడీ ఎలా సరిదిద్దుతారనేది ఆసక్తిగా మారింది.

జీడీపీ 3.8శాతంలోపే పడిపోయిన నేపథ్యంలో మోడీ సార్ జీడీపీ వృద్ధి రేటుకు దేశంలో కుదేలైన వివిధ రంగాలకు ఎలా ఉద్దీపనం ఇస్తాడన్నది ఆసక్తిగా మారింది.

మోడీ ప్రభుత్వం ఈ కొత్త బడ్జెట్ లో సాహసోపేత నిర్ణయాలను తీసుకోబోతున్నారని సమాచారం. 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి రేటు సాధిస్తానన్న మోడీ మరి ఈ ఆర్థిక మందగమనంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? దేశ ప్రజలకు ఎలాంటి రాయితీలు వరాలు ప్రకటిస్తారన్నది దేశవ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది.