Begin typing your search above and press return to search.
త్వరలో కేంద్రమంత్రిగా మరో తెలంగాణ వ్యక్తి
By: Tupaki Desk | 28 July 2020 12:20 PM ISTప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడంతో రాజ్యాంగ ప్రక్రియలో బీజేపీ పాత్ర కీలకంగా ఉంది. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లుకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని.. విజయవంతంగా రాష్ట్రం ఆవిర్భవించడానికి ఆ పార్టీ కృషి చేసింది. ఈ క్రమంలో దాన్ని పార్టీ తెలంగాణలో సద్వినియోగం చేసుకోలేకపోయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బలం చాటుకోవాలని ప్రయత్నిస్తుండగా సఫలం కాలేకపోతోంది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎట్టకేలకు అధిష్టానం రంగంలోకి దిగి 2024లో అధికారమే ధ్యేయంగా కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో పార్టీలో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ వ్యక్తిని తీసుకోనున్నట్లు సమాచారం. దీంతోపాటు పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కమల దళంలో వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఎవరికి అవకాశం లభించబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నవారితో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశం లభించేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులుగా నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రెండు పదాధికారుల పదవులు (ఆఫీస్ బేరర్లు), మరో రెండు కార్యవర్గ పదవులతో పాటు.. మోర్చాకు సంబంధించి కీలక పదవి తెలంగాణకు దక్కనుందని రాష్ట్ర పార్టీకి సమాచారం ఉంది. ఈ స్థానాల్లో ఎవరిని నియమించనున్నారో ఆసక్తికర చర్చ మొదలైంది.
పరిస్థితులను బట్టి చూస్తే పార్టీ పదాధికారిగా మురళీధర్‌రావుకు మరోసారి అవకాశం ఉంది. ఒకవేళ వేరొకరికి ఆ పదవి ఇస్తే ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా మరో ఆలోచన ఉంది. ఇక ఆఫీస్ బేరర్‌గా పార్టీ సీనియర్ నాయకుడికి బెర్త్ లభించనుండగా.. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, డీకే అరుణ, మోత్కుపల్లి నర్సిములు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ జాతీయ కార్యవర్గం లోకి తీసుకునేలా చర్చ నడుస్తోంది. మురళీధర్ రావు కాకుంటే గరికపాటి మోహన్‌రావు ను రాజ్యసభ కు పంపే ప్రయత్నం కూడా ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ కు పార్టీ లో విశేష ప్రాధాన్యం బీజేపీ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ కార్యవర్గంలో ఈసారి తెలంగాణ కు ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది.