Begin typing your search above and press return to search.
పాక్ కి మళ్లీ షాక్.. మరోసారి ‘గ్రే లిస్టు’ కే పరిమితం!
By: Tupaki Desk | 24 Oct 2020 4:00 PM ISTఇప్పటికే పాకిస్థాన్ ఆర్థికంగా కోలుకోలేకపోతుంది. ఈ సమయంలో పాకిస్థాన్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఎఫ్ ఏటీఎఫ్ మరోసారి షాక్ ఇచ్చింది. టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్ ను మళ్లీ ‘గ్రే లిస్టు’కే పరిమితం చేసింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ .. ఎఫ్ ఏటీఎఫ్ యాక్షన్ ప్లాన్ లోని 27 పాయింట్లను పూర్తిగా అమలు చేయడంలో విఫలం చెందింది. దీనితో మరోసారి పాక్ ను ఎఫ్ ఏటీఎఫ్ గ్రే లిస్టు’ కే పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
గత మూడు రోజులుగా జరుగుతున్న ఎఫ్ ఏటీఎఫ్ వర్చువల్ ప్లీనరీ సెషన్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఎఫ్ ఏటీఎఫ్ మాట్లాడుతూ పాకిస్థాన్ కు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ డెడ్ లైన్ లు అన్నీ ముగిసిపోయినట్టే అని తెలిపింది. ముఖ్యంగా ఎఫ్ ఏటీఎఫ్ జాబితా లో ఉన్న 4వేల మంది ఉగ్రవాదుల పై పాక్ ప్రభుత్వం ప్రయాణ షరతులను ఎత్తి వేయడం కూడా పాకిస్థాన్ పై నమ్మకం కోల్పోయేలా చేసింది. పాక్ గ్రే లిస్టు లో ఉన్న కారణంగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందడం కష్టంగా మారింది.
జూన్ 2018లో పాక్ ను ఎఫ్ ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది. అప్పటి నుంచి ఆ జాబితా నుంచి పాక్ బయటకి రాలేక పోతుంది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం పై ఉక్కుపాదం మోపాలని, 2019 నాటికి ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ను పూర్తిగా అమలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఎఫ్ ఏటీఎఫ్ కోరింది. ఈ మేరకు 27 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక ను అందజేసింది. అయితే, అందులో 21 అంశాల్లో మాత్రమే చర్యలు తీసుకున్న పాకిస్థాన్.. మరో ఆరు అంశాలపై చర్యలు తీసుకోలేదు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయాద్‌లపై చర్యలు తీసుకోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఆ దేశాన్ని మరోమారు గ్రే లిస్టుకే పరిమితం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.