Begin typing your search above and press return to search.

భూమా అఖిలప్రియకు మరో షాక్?

By:  Tupaki Desk   |   26 Jan 2021 11:23 AM IST
భూమా అఖిలప్రియకు మరో షాక్?
X
సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుపాలై తాజాగా బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియకు మరో షాక్ తగిలింది. ఆమెకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.తాజాగా భూమా అఖిలప్రియ కుటుంబానికి చెందిన డెయిరీని మూసేశారని సమాచారం.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి దంపతుల తనయుడు జగత్ పేరుతో 20212లో ఈ డెయిరీని ఏర్పాటు చేశారు. అఖిలప్రియ పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఈ డెయిరీని చూసుకునేవాడు.

అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన స్థానంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. రాజకీయాల్లో బిజీ అయ్యారు. దీంతో డెయిరీని పట్టుకోకపోవడంతో నష్టాల పాలైంది.. ఏడాదిగా డెయిరీకి సంబంధించిన విద్యుత్ బిల్లులను సైతం చెల్లించలేదని సమాచారం. ప్రస్తుతం ఆ బిల్లుయే రూ.కోటి బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు డెయిరీకి విద్యుత్ ను కట్ చేశారు.ఈ నేపథ్యంలోనే జగత్ డెయిరీని కూడా మూసివేశారని సమాచారం. డెయిరీ ఇలా అప్పుల పాలై మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని దాన్నే నమ్ముకొని పాలు పోస్తున్న రైతులు వాపోతున్నారు.