Begin typing your search above and press return to search.
ఢిల్లీలో బయటపడ్డ మరో రహస్య సొరంగం..ఎక్కడి నుండి ఎక్కడికంటే
By: Tupaki Desk | 3 Sept 2021 11:00 AM ISTభారతదేశ రాజధాని, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు నిలయం. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు ఢిల్లీ కేంద్రంగా వెలిశాయి. ఆ తర్వాత ఏవో కారణాలతో అదే స్థాయిలో పతనం కూడా అయ్యాయి. ఢిల్లీ అనగానే రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, జామా మసీదు, తుగ్లకాబాద్ ఫోర్ట్, జంతర్ మంతర్ వంటి చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అటువంటి గొప్ప కట్టడాలకు సాక్ష్యంగా ఓ సొరంగం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో సభ్యులు సమావేశమయ్యే ప్రదేశంలో కనిపించింది ఓ సొరంగం.
అసెంబ్లీ నుంచి చారిత్రాత్మక కట్టడం రెడ్ ఫోర్ట్‌కు దారి తీసేలా దీన్ని నిర్మించినట్లు కనుగొన్నారు. పంజాబీ బాగ్, పూర్వీ షాలిమార్ బాగ్ ప్రాంతంలో గల ఓల్డ్ సెక్రెటేరియట్ లో ఉంటుంది ఢిల్లీ అసెంబ్లీ భవన సముదాయం. అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇన్ని కిలోమీటర్ల దూరం పాటు ఈ సొరంగాన్ని తవ్వినట్టు వెల్లడైంది . ఈ సొరంగానికి చారిత్రాత్మక ఆనవాళ్లు ఏమీ లేవని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు. ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించలేదని భావిస్తున్నట్లు చెప్పారు. సొరంగం తవ్వడానికి వినియోగించిన పరికరాలు ప్రాచీన కాలానికి సంబంధించినవి కాకపోవచ్చని వెల్లడించారు.
బ్రిటీషర్ల పరిపాలనలో ఈ టెన్నెల్ నిర్మితమై ఉండొచ్చని భావిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుల దాడుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటీషర్లు దీన్ని కట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. 1993లో తొలిసారిగా తాను శాసనసభకు ఎన్నికైన తరువాత.. ఈ టెన్నెల్ గురించి కొంత ఆరా తీశానని రామ్ నివాస్ గోయెల్ చెప్పారు. పంజాబీ బాగ్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ఓ టన్నెల్ ఉన్నట్లు తాను పుస్తకాల్లో చదివానని, అది అసెంబ్లీలోనే బయటపడుతుందని ఊహించలేదని ఆయన తెలిపారు. తాను వెదికిన చారిత్రక పుస్తకాల్లో ఎక్కడ కూడా ఈ టన్నెల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలోనే ఇది వెలుగులోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు.
ఈ సొరంగాన్ని మరింత తవ్వే ఆలోచన ఏదీ లేదని స్పీకర్ చెప్పారు. దీనివల్ల మెట్రో రైలు ప్రాజెక్టులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు. బ్రిటీషర్ల హయాంలో ఇప్పుడు అసెంబ్లీ ఉన్న ప్రాంతంలో కారాగారం ఉండేదని, స్వాతంత్య్ర సమరయోధులను జైలుకు తరలించడానికి ఈ టన్నెల్ ను వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పంజాబీ బాగ్ ప్రాంతంలో ఇప్పటికీ కారాగారాలు ఉన్నాయని, దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను ఆ కారాగారాలను సందర్శించానని చెప్పారు. దేశ రాజధానిగా ఎన్నో స్వాతంత్య్ర పోరాటాలు, మహోద్యమాలు సాగాయని స్పీకర్ గోయెల్ గుర్తు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సొరంగాన్ని విస్తరించాలనే ప్రతిపాదనలేవీ లేవని, అలాంటి వాటిని ఆమోదించకపోవడమే ఉత్తమమని గోయెల్ వెల్లడించారు.