Begin typing your search above and press return to search.
మంగళగిరిలో మరో దారుణం ... వివాహితపై గ్యాంగ్ రేప్ !
By: Tupaki Desk | 18 Feb 2020 12:15 PM ISTఎన్ని కఠిన చట్టాలని తీసుకువచ్చినప్పటికీ దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలంగాణ లో జరిగిన దిశ ఉందంతం తరువాత వారిని ఎన్ కౌంటర్ చేసినా , అలాగే ఏపీలో మహిళల కోసం ప్రత్యేకంగా దిశ యాక్ట్ ని తీసుకొచ్చినా కూడా మహిళల పై జరిగే అఘాయిత్యాలు మాత్రం తగ్గడంలేదు. ఇంట్లో నుండి బయటకి వెళ్లిన మహిళా మళ్లీ ఇంట్లోకి వచ్చేవరకు ఎలా ఇంటికి చేరుతుందో అని ఇంట్లోని వారు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇకపోతే తాజాగా మంగళగిరి సమీపం లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఓ మహిళ పై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 15,2020 జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం రేపుతోంది.
ఈ ఘటన ఎలా జరిగింది అన్న విషయాన్ని పరిశీలిస్తే .... గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ వివాహిత... ఓ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థలో పనిచేస్తోంది. ఆమె కొద్దిరోజుల క్రితం.. విజయవాడ నుంచి స్కూటీ పై వస్తున్నపుడు ఓ యువకుడికి లిఫ్ట్ ఇచ్చింది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. డిస్టెన్స్ కోర్సుల ద్వారా విద్యార్హతల ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తానని ఆమె యువకుడితో తెలిపింది. అదే అవకాశంగా తీసుకోని, తనకు, తన ఫ్రెండ్స్‌కు కూడా డిస్టెన్స్ సర్టిఫికెట్స్ కావాలని అడిగాడు. దీనితో ఆమె ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని వివాహిత తెలిపింది.
దీంతో తన ఫ్రెండ్స్ ను కలవడానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆమెను 2020, ఫిబ్రవరి 15న మంగళగిరి మండలం చినకాకాని హాయ్ ల్యాండ్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి కాపాడుకునేందుకు సదరు మహిళ కొంతదూరం పాటు నగ్నంగా పరిగెత్తినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన మరునాడు వివాహిత మంగళగిరి పీఎస్ లో ఫిర్యాదు చేసింది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు చైతన్య, ఆశీర్వాదం, నాగేశ్వర్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.