Begin typing your search above and press return to search.

మస్క్​ నుంచి మరో ప్రాజెక్టు.. జీవితాలనే మార్చేసే న్యూరాలింక్​.!

By:  Tupaki Desk   |   24 Jan 2022 9:31 AM GMT
మస్క్​ నుంచి మరో ప్రాజెక్టు.. జీవితాలనే మార్చేసే న్యూరాలింక్​.!
X
మానవ జీవితాలను మార్చేసి ఒక సరికొత్త ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చాలా అరుదైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన మాస్క్ తాజాగా మరో ప్రయోగాయానికి సిద్ధం అవుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మాత్రం మానవ జీవన స్థితి గతులు పూర్తిగా మరిపోతాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మాస్క్ చేపట్టిన ఆ బృహత్తర కార్యక్రమం అటువంటిది.

ఈ కార్యక్రమం తోనే మాస్క్ ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇంతకూ ఆ ప్రాజెక్టు ఏంటి అంటే సకల ఆలోచనలకు మూలం అయిన మానవ మెదడులోకి మాస్క్ సంస్థ తయారు చేస్తోన్న ఒక చిన్న చిప్ ను ప్రవేశ పెట్టడం. ఈ విధంగా ప్రవేశ పెట్టిన ఆ చిప్ ద్వారా మానవ మెదడులో ఉండే విద్యుత్ అయస్కాంత విధానం ద్వారా మానవ ఆలోచనలను రికార్డ్ చేయడం అనేది అసలు ప్లాన్. ఇలా చేయడం ద్వారా రోబో సినిమాలో లాగా మానవుని జ్ఞాపకాలను బంధించవచ్చు.

ఇలా మానవును శరీరంలోని మెదడులో చిప్​ ను అమర్చి దానిలోని ఆలోచనలు బంధించడం అనే ప్రాజెక్టుకు మస్క్ 2017లో ఓ స్టార్టర్ప్​ ను ప్రారంభించారు. దాని పేరే న్యూరా లింక్​. ఇది ప్రారంభించిన నాలుగేళ్లలోనే అనుకోని రీతిలో పరిశోధనల్లో పురోగతి సాధించింది. ఇందులో భాగంగానే ఈ సంస్థ ప్రస్తుతం క్లినికల్​ డైరెక్టర్ ను నియమించే ఆలోచనలో ఉంది. అంతేగాకుండా మస్క్ చేపట్టిన ప్రయోగం ఆఖరి దశకు చేరుకున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇలా మానవుల ఆలోచనలను రికార్డ్ చేసే ఈ టెక్నాలజీని బ్రెయిన్​ కంప్యూటర్​ ఇంటర్​ ఫేస్​ అని అంటారని పేర్కొన్నారు.

ఈ ఆవిష్కరణ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే మన బ్రెయిన్​ సమస్యలతో భాదపడుతున్న చాలా మందికి ఇది ఒక గొప్ప సాంకేతికతగా నిలుస్తోందని చెప్తున్నారు. అంతే గాకుండా ఇది అందుబాటులోకి వస్తే వెన్ను ఎముక సమస్యలతో బాధాపడే వారికి కూడా మంచి ఊతం దొరకుతుందని చెప్తున్నారు. ఈ ప్రయోగాలు అమలులోకి వస్తే దీనిని ఉపయోగించి కదలలేని మనిషిలో కూడా చలనం తెప్పించవచ్చని చెప్తున్నారు. ఇదే జరగితే సాంకేతిక పరిజ్ఞానంలో గొప్ప ఆవిష్కరణకు తెరతీసిని వ్యక్తిగా ఎలన్​ మస్క్​ నిలిచిపోతారని చెప్తున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన ఈ ఏడాది చివరి నాటి పూర్తి అవుతుందని న్యూరా లింక్​ చెప్తుంది.

సాధారణంగా మస్క్​ కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ పై మంచి ఆభిప్రాయం లేదని బహిరంగ వర్గాల్లో టాక్​. దానిని అరికట్టేందుకు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వచ్చినట్లు తెలిసిన వారు చెప్తుంటారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే కీలక ముందడుగు పడినట్లు సంస్థ తెలిపింది. దీనిని జంతువులపై ప్రయోగిస్తే విజయవంతం అయినట్లు చెప్పారు సంస్థ ప్రతినిధులు. ముఖ్యంగా మానవుడు వచ్చిన కోతి జాతి పై ప్రయోగం జరిపినట్లు చెప్తారు. ఇలా చేసిన కోతి ఎటువంటి ఆధారం లేకుండా వీడియో గేమ్​ ఆడినట్లు తెలిపారు. ఈ వార్త గతంలో బాగా వైరల్​ కూడా అయ్యింది.