Begin typing your search above and press return to search.
కరోనాతో మరో సమస్య..యువతలో 60 % మందికి మానసిక ఆరోగ్య సమస్యలు
By: Tupaki Desk | 12 Oct 2020 3:30 PM ISTదేశంలో ప్రస్తుతం మానసిక ఆందోళన సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమైంది. వీరిలో అధిక శాతం యువతే ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా పరిస్థితులు మొదలైనప్పటి నుంచి మానసిక ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. కరోనా రాకతో ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నం అయ్యాయి. ఉపాధి కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో అందరిలో భయం, ఆందోళన, అసహనం, ఒత్తిడి, డిఫ్రెషన్ ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో ఈ పరిస్థితి అధికమైందని ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సంస్థ ప్రాక్టో వెల్లడించింది. అందులో పురుషులు 70 శాతం ఉండగా, మహిళలు 30 శాతం ఉన్నారని చెప్పింది.
మానసిక సమస్యలతో బాధ పడుతూ తమ సంస్థ నిపుణుల నుంచి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు అధిక మయ్యారని ఆ సంస్థ వెల్లడించింది. నిపుణులను సంప్రదిస్తున్న వారిలో 60 శాతం మంది యువతే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వీరంతా 21-30ఏళ్ల వయస్సువారేనని ప్రాక్టో పేర్కొంది. 25 శాతం వాటా 31-41ఏళ్ల వయస్సు వారు కాగా, 5 శాతం మంది 41-60ఏళ్లు, 10శాతం వాటా 60ఏళ్లకుపైబాడిన వారు ఉన్నారు. ఏడాది కాలంలో మానసిక ఆరోగ్యంపై ప్రశ్నించే వారి సంఖ్య 665% పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. మరో ఆందోళన పరిచే అంశం ఏమిటంటే ప్రాక్టో ను సంప్రదిస్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది 21-40 సంవత్సరాల వయస్సు గల భారతీయుల నుంచే వస్తున్నాయి.
ప్రాక్టో హెల్త్ ఇన్‌సైట్స్ ని సంప్రదిస్తున్న ప్రజల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా వంటి మెట్రో నగరాల నుంచి 65% ప్రశ్నలు, చండీగఢ్, లక్నో, భువనేశ్వర్, జైపూర్, హుబ్లీ, కాన్పూర్. అహ్మదాబాద్ వంటి మెట్రోయేతర నగరాల నుంచి 35% ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ ఆరు నెలల కాలంలో ఈ నగరాల నుంచి మానసిక సమస్యలపై వచ్చే ప్రశ్నల సంఖ్య చాలా వరకూ పెరిగింది. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ డైరెక్ట్ కౌన్సిల్ సభ్యుడు ప్రొఫెసర్ హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ అమృత్ పట్టోజోషి మాట్లాడుతూ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రజలు ప్రాక్టో వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్ ద్వారా మానసిక వైద్యులను, మనస్తత్వవేత్తలను సంప్రదించాలని సూచించారు. తద్వారా ప్రారంభ దశలోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.