Begin typing your search above and press return to search.

ఢిల్లీలో నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చే మరో దారుణం

By:  Tupaki Desk   |   7 Aug 2020 12:40 PM IST
ఢిల్లీలో నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చే మరో దారుణం
X
దేశ రాజధానిలో యావత్ దేశాన్ని కదిలించి వేసిన నిర్భయ ఘటన గుర్తుకు తెచ్చే ఉదంతం తాజాగా ఒకటి చోటు చేసుకుంది. విన్నంతనే వికారంగా అనిపించటమే కాదు.. బాధితురాలి బాధను తలుచుకుంటేనే గుండెలు అదిరిపోవటం ఖాయం. నాడు జరిగిన నిర్భయ ఘటనను పోలి ఉండే ఈ ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. నార్త్ ఢిల్లీలో జరిగిన ఈ దారుణంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకూ జరిగిందేమంటే?
కూలి పనులకు వెళ్లే తల్లిదండ్రులకు పన్నెండేళ్ల కుమార్తె ఉంది. మంగవారం వారు కూలి పనికి వెళ్లారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఈ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దారుణ రీతిలో అత్యాచారం చేయటమే కాదు.. ముఖం మీద.. మర్మాంగం మీద బలమైన వస్తువులతో గాయపరిచినట్లుగా తెలుస్తోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ బాలిక ఉదంతం నాటి నిర్భయ ఘటనకు దగ్గరగా ఉందని చెబుతున్నారు.

దారుణమైన అత్యాచారానికి గురైన ఆ బాలికకు పేగుల్లోనూ తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. చావు బతుకుల మధ్య పోరాడతున్న వైనం పలువురిని కదిలించి వేస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ ఉదంతానికి కారణమైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా లభించిన సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడు పాత నేరస్తుడైన క్రిష్ణన్ గా అనుమానిస్తున్నారు.

తాజాగా బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వల్లడించారు. జరిగిన దారుణంపై పలువురు తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాధితురాలి కుటుంబం వద్దకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెళ్లారు. వారిని పరామర్శించి.. ఓదార్చారు. మరోవైపు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్.. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సనర్ స్వాతి మలివాల్.. ఇతర మహిళా హక్కుల నేతలు బాధితరాలు తల్లిదండ్రుల్ని పరామర్శిస్తున్నారు.