Begin typing your search above and press return to search.
విశాఖ గజగజ.. వణికిస్తున్న వింతరోగం.. ఐదుగురు మృతి
By: Tupaki Desk | 18 Sept 2020 4:00 PM ISTఇప్పటికే కరోనా మహమ్మారితో ఓ పక్క జనాలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మరో వింతరోగం దాపురించింది. ఈ అంతుచిక్కని రోగానికి ఐదుగురు బలయ్యారు. వెంబడే అప్రమత్తమైన వైద్యశాఖ వివరాలు సేకరించింది. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయితీ కరకవలస, చినరాభ గ్రామాల్లో గత మూడువారాల్లో ఐదుగురు గిరిజనులు ఈ మాయదారి రోగానికి బలయ్యారు. కొన్నిరోజుల వ్యవధిలోనే జ్వరం , కడుపునొప్పి, కాళ్లు చేతులువిపరీతంగా వాపులు వచ్చి చనిపోయారని స్థానికులు చెబుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఐదుగురు చనిపోవడంతో వెంబడే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణి అధికారులతో మాట్లాడారు. విశాఖ డీఎంహెచ్వో వైద్యసిబ్బందితో కలిసి వ్యాధి సోకిన గ్రామాలను పరిశీలించి పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో అనారోగ్యం బారిన పడిన మొత్తం 18 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా గిరిజనులు చాలాకాలం పాటు నిలువ ఉంచి మాంసాన్ని తినడం వల్లే అనారోగ్యం బారిన పడిఉంటారని వైద్య అధికారులు ప్రాథమికంగా తేల్చారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగవలసి ఉంది. కాగా మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు వైద్యసదుపాయం అందుబాటులో లేదు. వారికి ఏమన్నా అనారోగ్యం కలిగితే భీమవరం హెల్త్సెంటర్కు వెళ్లాల్సి ఉన్నది. అందుకోసం 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అందువల్ల ప్రభుత్వం స్పందించి తమ గ్రామాల్లో హెల్త్క్యాంపులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.