Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌రో కొత్త పార్టీ ? జ‌గ‌న్ కు ఝ‌ల‌క్ !

By:  Tupaki Desk   |   14 March 2022 11:30 AM GMT
ఏపీలో మ‌రో కొత్త పార్టీ ? జ‌గ‌న్ కు ఝ‌ల‌క్ !
X
ఒక‌ప్పుడు జ‌గ‌న్ కు అండ‌గా ఉన్న వర్గాల‌ను టీడీపీ చేరువ చేసుకోవాల‌ని చూస్తోంది. ముఖ్యంగా ఎస్సీలు, క్రిస్టియన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వీరిని ఎంత లాగితే అంతగా జగన్ విజయావకాశాలు తగ్గుతాయన్నది తెలుగుదేశం ఆలోచన. అయితే ఇంతలో టీడీపీకి లాభించే ఒక పరిణామం ఏపీలో అనుకోకుండా జరుగుతోంది.

గ‌తంలో ఎయిమ్ (అంబేద్క‌ర్ ఇండియా మిష‌న్) పేరిట ఓ పోలీసు ఉన్న‌తాధికారి ఇలానే ఆ రాజ‌కీయ రంగాన్ని ప్ర‌భావితం చేయాల‌ని భావించారు. ఇప్పుడిదే కోవ‌లో మ‌రో మాజీ న్యాయ‌మూర్తి అడుగులు వేయ‌డం ఓ విధంగా ఆస‌క్తిక‌రం.చ‌ర్చ‌కు కార‌కం కూడా!

ఆంధ్రావ‌నిలో మ‌రో కొత్త పార్టీ రానుంది.అంబేద్క‌ర్ జ‌యంతి ఏప్రిల్ 14న సంబంధిత ప్ర‌క‌ట‌న ఒక‌టి వెలుగులోకి రానుంది.త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ ఒక‌టి వెల్ల‌డి చేయ‌నున్నామ‌ని జై భీమ్ యాక్సెస్ జ‌స్టిస్ పేరిట ఓ సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్న మాజీ న్యాయమూర్తి జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌హుజ‌నులు పోటీ చేయ‌నున్నార‌ని క్లారిఫికేష‌న్ ఒక‌టి ఇచ్చారు. రాష్ట్రంలో ద‌ళితుల‌కు న్యాయం ద‌క్క‌డం లేద‌న్న ఆవేద‌నతో పార్టీని ప్రారంభిస్తున్నామ‌ని వెల్ల‌డి చేశారు.ఇక ఇప్ప‌టికే కొంద‌రు ద‌ళితులు జ‌గ‌న్ పై పోరు బాట సాగించేందుకు సిద్ధంగా ఉండ‌డంతో వారికి వీరు జత కానున్నారు.

వాస్త‌వానికి ద‌ళితులు,క్రిస్టియ‌న్లు, మైనారిటీలు గ‌తంలో జ‌గ‌న్ కు బాగానే మ‌ద్ద‌తు ఇచ్చారు.గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు అండ‌గా ఉండి ఆయ‌న గెలుపును ప్ర‌భావితం చేశారు.కానీ అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ తాము చేసిన మేలు మ‌రిచిపోయార‌ని వీరంతా మండిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న ఒక‌టి వెలుగులోకి రావ‌డంతో చాలామంది ఆశావ‌హులు ముఖ్యంగా జ‌గ‌న్ అంటే వ్య‌తిరేకత ఉన్న వారు అదేరీతిన జ‌గ‌న్ ద‌గ్గ‌ర స‌మ ప్రాధాన్యం ద‌క్క‌ని వారు ఇటుగా వచ్చే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయి.

గ‌తంలో ద‌ళితుల‌ను ప్ర‌ధానంగా బీఎస్పీ ఆకట్టుకునేది.కానీ ఆంధ్రా రాజ‌కీయాల్లో పెద్ద‌గా పేరు తెచ్చుకోలేక‌పోయింది. ఇంకా చెప్పాలంటే ద‌ళితుల‌పై మంచి ప్రేమ చూపించిన పార్టీ కాంగ్రెస్.ఆ పార్టీ కూడా కాల క్ర‌మంలో ఎందుక‌నో ద‌ళితుల‌కు దూరం అయింది. ఇందిరా గాంధీ హ‌యాం నుంచి ద‌ళితుల‌కు మేలు చేసిన పార్టీ కాంగ్రెస్సేన‌ని అంతా ఇవాళ్టికీ అంటున్నా, ఆ విధంగా ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో మాత్రం సంబంధిత వ‌ర్గాలు ప్ర‌వ‌ర్తించ‌లేక‌పోతున్నాయి.దీంతో కొత్త పార్టీ వ‌స్తే రాష్ట్రంలో ద‌ళిత ఓట్లు చీలిపోవ‌డం ఖాయం.