Begin typing your search above and press return to search.
ఏపీలో మరో మంత్రికి కరోనా.. కారణం అదేనా?
By: Tupaki Desk | 29 Sept 2020 10:45 AM ISTఏపీ సీఎం జగన్ చేతులుమీదుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం జగన్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని స్వామి వారి సేవలో తరించారు. అయితే ఇప్పటికే తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఓ మంత్రికి కరోనా సోకగా.. తాజాగా మరో మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణకు కూడా కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే బ్రహ్మోత్సవాల్లో జగన్ తోపాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి కరోనా సోకడంతో ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా ఐసోలేషన్ లో ఉంటున్నారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఇద్దరు మంత్రులకు మూడు రోజులకు కరోనా లక్షణాలు బయటపడడంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర మంత్రులు కూడా జాగ్రత్త పడుతున్నారు. కొందరు టెస్టులు చేయించుకున్నట్టు తెలిసింది.
ఏపీలో కరోనా తీవ్రత తగ్గడం లేదు. రోజుకు 7వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 60మంది వరకు చనిపోతున్నారు. దీంతో ఇలాంటి పర్యటనలు తగ్గించుకుంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు.