Begin typing your search above and press return to search.
మరో లోహ స్తంభం.. ఈసారి పోలాండ్ లో ప్రత్యక్షం, ఎవరు చేస్తున్నారు !
By: Tupaki Desk | 11 Dec 2020 10:39 AM ISTటెక్నాలజీ ఇంతలా పెరిగినా... ఇప్పటికీ కొన్ని అంశాలు మిస్టరీగానే మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా అనేక దేశాల్లో ఏకశిల ప్రత్యక్షమై మాయపోతున్న విషయం తెలిసిందే. తాజాగా పోలాండ్ రాజధాని వార్సాలో మెటల్ ఏకశిల ప్రత్యక్షమైంది. జాగర్లు విస్తులా నది వద్ద గురువారం ఉదయం జాగింగ్ చేస్తుండగా ఈ ఏకశిల కనిపించినట్టు తెలుస్తోంది. ఓ బ్రిడ్జి ఒడ్డున ఉన్న ఇసుకలో ఏకశిలను పాతిపెట్టినట్టుగా విస్తులా జిల్లా అధికారులు చెబుతున్నారు. పది అడుగుల ఎత్తు ఉన్న ఈ ఏఖశిల సిల్వర్ రంగులో ఉన్నట్టు తెలిపారు.
గురువారం పొద్దున్న ఈ ఏకశిలను జాగర్లు గుర్తించగా, ఇప్పటివరకు ఈ ఏకశిలను పాతిపెట్టింది తామేనంటూ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కాగా.. అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఉన్న ఓ ఏడారిలో మొట్టమొదటిసారి ఏకశిల ప్రత్యక్షమైంది. ఆ తర్వాత పలు ప్రదేశాల్లో ఈ లోహ స్థంభం ప్రత్యక్షం అవుతూ వస్తుంది.
యూరప్ దేశం రొమేనియాలో... ఓ లోహ స్తంభం సడెన్ గా ప్రత్యక్షమైంది. సరిగ్గా ఇలాంటిదే అమెరికాలోని ఉటా ఎడారిలో కొన్ని రోజుల కిందట కనిపించింది. అది అక్కడకు ఎలా వచ్చిందో తెలుసుకునేలోపే, అది అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. దాన్ని అక్కడ మనుషులు పెట్టారా, ఏలియన్స్ పెట్టారా అన్నది తెలియలేదు. అది మాయమైపోవడంతో ఆ మిస్టరీ అలా ఉండిపోయింది. తాజాగా సేమ్ అలాంటిదే మరో లోహ స్తంభం, రొమేనియాలో ఇప్పుడు కనిపిస్తోంది. త్రికోణ ఆకారంలో ఉన్న ఈ లోహ స్తంభం, రొమేనియాలోని, పియత్రా నీమ్త్‌లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల అవతల కనిపించిందని డైలీ మెయిల్ తెలిపింది. తాజాగా పోలాండ్ లో ప్రత్యక్షం అయింది.