Begin typing your search above and press return to search.

వైరల్: ఈటల మరో ఆసక్తికర ట్వీట్

By:  Tupaki Desk   |   2 May 2021 4:32 AM GMT
వైరల్: ఈటల మరో ఆసక్తికర ట్వీట్
X
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వైద్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వైద్యశాఖ మంత్రిగా తొలగించిన నేపథ్యంలో ఈటల తాను ఆరోగ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈటల ట్వీట్ చేస్తూ ‘కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ,శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను’ అని ఈటల పేర్కొన్నారు..

ఇక మరో ట్వీట్ లో ‘గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ’ అంటూ వారిని ఈటల తలుచుకున్నారు.

వైద్య ఆరోగ్యశాఖ నుంచి తప్పించిన నేపథ్యంలో ఈటల వారందరికీ థ్యాంక్స్ చెప్పడం వైరల్ గా మారింది.