Begin typing your search above and press return to search.

చేవెళ్లలో మరో దిశ.. అత్యాచారం చేసి హత్య?

By:  Tupaki Desk   |   17 March 2020 12:30 PM IST
చేవెళ్లలో మరో దిశ.. అత్యాచారం చేసి హత్య?
X
మరో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని చేవెళ్ల మండలంలో ఒక యువతిని దారుణంగా హత్య చేసిన వైనాన్ని గుర్తించారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని ముప్ఫై ఏళ్ల మహిళ డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళ శరీరంపై దుస్తులు లేకపోవటం.. తల మీద బండరాయి మోది హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆధారాల కోసం ఘటనాస్థలానికి దగ్గర్లో ఏమైనా వదిలేసి ఉంటారా? అని వెతుకుతున్నారు. దగ్గర్లోని సీసీ కెమేరాల్ని పరిశీలిస్తున్నారు. మహిళలకు చెందిన వస్తువులు కానీ.. దుస్తులు కానీ లేకపోవటంతో.. ఆమె ఎవరై ఉంటారు? అన్నది ప్రశ్నగా మారింది.

హత్యకు గురైన మహిళ ఏ ప్రాంతానికి చెందినదై ఉంటుందన్న విషయం తెలిస్తే.. విచారణ తేలిక అవుతుందని భావిస్తున్నారు. అయితే.. గుర్తు పట్టలేని రీతిలో ముఖాన్ని బండరాయి తో మోదటంతో.. బాధిత మహిళ ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.