Begin typing your search above and press return to search.
బెజవాడలో మరో ఆస్పత్రి అరాచకం.. వేటేసిన కలెక్టర్
By: Tupaki Desk | 13 Sept 2020 3:40 PM ISTకరోనా విపత్తును ఆసరాగా చేసుకున్న కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను జలగల్లా పీల్చుకుతింటున్నాయి. మందులేని కరోనా వ్యాధికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పీపీఈ కిట్లకు కూడా వేలలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కరోనా లాక్డౌన్ టైంలో గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా వైద్యానికి సర్కార్ అనుమతి ఇవ్వడంతో రెచ్చిపోయాయి. ఒక్కో పేషెంట్ వద్ద లక్షల్లో ఫీజులు వస్తున్నాయి. ఆస్తులమ్మి మరి ఫీజులు చెల్లిస్తున్నారు సాధారణ ప్రజలు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ఓ ఆస్పత్రిపై కృష్ణా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆ ఆస్పత్రికి కోవిడ్ వైద్యానికి ఇచ్చిన అనుమతిని రద్దుచేశారు.
విజయవాడలో వైద్యవ్యాపారం జోరుగా సాగుతున్నది. లిబర్జీ ఆస్పత్రి యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంతోపాటు రోగులను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ఆస్పత్రి పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.
రాజమండ్రి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. దీంతో అతడిని కుటుంబసభ్యులు విజయవాడలోని లిబర్టీ హాస్పిటల్‌లో చేర్పించారు. టెస్టులు, మందుల పేరుచెప్పి హాస్పిటల్ యాజమాన్యం లక్షల రూపాయలు గుంజింది. రోజువారి పీపీఈ కిట్లకే వేలల్లో ఫీజులు వసూలు చేశారు. సాధారణంగా బయట రూ. 300 లకు దొరికే పీపీఈ కిట్లకు రోజుకు రూ.10 వేలు బిల్లు వేశారు. టెస్టులు, వైద్యం, నర్సింగ్ఖర్చులు, శానిటేషన్ ఖర్చు అంటూ లక్షల్లో ఫీజులు వసూలు చేసింది యాజమాన్యం. చివరకు ఆ వ్యక్తి మరణించాడంటూ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి భార్య కృష్ణా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి నిర్వాకంపై కలెక్టర్ ఓ కమిటీని వేసి విచారించారు. లిబర్టీ హాస్పిటల్ అధిక ఫీజు వసూలు చేసిందని నిర్ధారణ కావడంతో ఆ ఆస్పతికి ఇచ్చిన అనుమతులు రద్దుచేశారు. అంతేకాక అక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీచేశారు.