Begin typing your search above and press return to search.

ఏపీలో మరో ఘోరం ... కన్నకూతురిని గర్భవతిని చేసిన కీచక తండ్రి !

By:  Tupaki Desk   |   29 Oct 2020 11:10 PM IST
ఏపీలో మరో ఘోరం ...  కన్నకూతురిని గర్భవతిని చేసిన కీచక తండ్రి !
X
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధుల్లో ఏ మాత్రం భయం కలగడం లేదు. చిన్నారులపై సైతం అకృత్యాలకు తెగబడుతున్నారు. వావీవరసలు మరచి కామవాంఛలతో రెచ్చిపోతున్నారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్తే.. ఎవ్వ‌డు కాటేస్తాడో తెలియ‌దు. ఎప్పుడు ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి కానీ, ఇంట్లోనే, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పాడుప‌ని చేశాడు. వావీవరసలు మరచి కామవాంఛతో రెచ్చిపోయాడు. కన్నకూతురిపై గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ గర్భవతిని చేసిన కీచక తండ్రి బాగోతం తాజాగా వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... విశాఖపట్నం, మల్కాపురం శివారు ఎన్టీఆర్ నగర్‌ కి చెందిన ఓ వ్యక్తి భార్య, ఇద్దరు కూతుళ్లతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ మధ్య భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచానికే పరిమితం అయింది. దీనితో తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురిపై నీచానికి ఒడిగట్టాడు. కొద్దినెలల కిందట రాత్రి సమయంలో కూతురు నిద్రిస్తుండగా ఆమె వద్దకు వెళ్లి కోరిక తీర్చాలంటూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చెప్పినట్లు వినకపోతే చంపేస్తానని బెదిరించి కూతురిపై పడి పశువాంఛలు తీర్చుకుంటున్నాడు. ఇక , తీరా బాలిక కడుపు పైకి ఎత్తుగా కనిపిస్తోందని బంధువులు ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భవతిగా తేలింది. కన్నకూతురిపై అత్యాచారం చేస్తూ గర్భవతిని చేసినట్లు తెలియడంతో కీచక తండ్రిపై కాలనీవాసులు రెచ్చిపోయి దేహశుద్ది చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.