Begin typing your search above and press return to search.

వయాగ్రా వేసుకునే వారికి మరో గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   24 Jun 2022 1:30 AM GMT
వయాగ్రా వేసుకునే వారికి మరో గుడ్ న్యూస్!
X
పురుషుల్లో అంగస్తంభనకు ఉపయోగించే ‘వయాగ్రా’ వల్ల మరో లాభం ఉందని పరిశోధనల్లో తేలింది. వయాగ్రాకు క్యాన్సర్ వ్యాధిని నయం చేసే శక్తి కూడా ఉందట.. కీమోథెరపీ కంటే పవర్ ఫుల్ గా వయాగ్రా పనిచేస్తుందట.. యూకేకు చెందిన ఓ క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. క్యాన్సర్ కణానికి రక్షణ కవచంగా ఉండే ఎంజైమ్లను వయాగ్రా నాశనం చేసిందని.. దాని వల్ల కిమో డ్రగ్స్.. క్యాన్సర్ గడ్డలను సులభంగా నాశనం చేయగలిగాయని పరిశోధకులు వెల్లడించారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు.

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఉండే ఎంజైమ్లు వయాగ్రా నాశనం చేసిందని.. దానివల్ల కిమో డ్రగ్స్.. క్యాన్సర్ గడ్డలను సులభంగా నాశనం చేయగలిగాయని పరిశోధకులు వెల్లడించారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులపై ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు.

ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని.. వయాగ్రాను క్యాన్సర్ సంబందిత ఔషధాలతో కలిపినట్లైతే మనుషుల్లో ఏర్పడే మరిన్ని క్యాన్సర్లను మరింత బాగా ఎదుర్కోవచ్చని వెల్లడించారు. లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరికీ ఈ ఔషధాలు పనిచకొస్తాయని తెలిపారు. పైగా ఈ ఔషధాలు ఎలాంటి అవాంఛిత ఉద్వేగానికి దారితీయవన్నారు.

పరిశోధనలో భాగంగా నిపుణులు ఎసోఫాగియల్ అనే క్యాన్సర్ కణాలపై కీమోథెరపీతో కలిపి ‘పీడీఈ5 ఇన్హిబిటర్స్’ అనే వయాగ్రాను ఎలుకలపై ప్రయోగించారు. దీంతో క్యాన్సర్ కణాలకు రక్షణగా ఉండే ఎంజైమ్ ల స్తాయిలు తగ్గాయి.

క్యాన్సర్ కణాలు నేరుగా కీమోకు గురయ్యేందుకు సహకరించాయి. ఎలుకల్లోని కణితులు.. నేరుగా ఇచ్చే కిమో కంటే వయోగ్రాతో కలిపి ఇచ్చిన కీమోకు ఎక్కువశాతం కుచించుకుపోయినట్లు సెల్ రిపోర్ట్స్ మెడిసన్ జర్నల్ వెల్లడించింది.

కిమో, వయాగ్రా కాంబినేషన్ లో మందులను తయారు చేసే యోచనలో ఉన్నారు. ముందుగా గొంతు క్యాన్సర్ రోగులకు ఈ మందులను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ప్రతిరోజు దాన్ని ఔషధంగా ఇవ్వడం వల్ల ఎలుకల్లో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం తగినట్లు పరిశోధకులు వెల్లడించారు.