Begin typing your search above and press return to search.

కీటో డైట్​ చేసేవారికి.. మరో కిక్కిచ్చే న్యూస్​

By:  Tupaki Desk   |   25 Sept 2020 3:00 PM IST
కీటో డైట్​ చేసేవారికి.. మరో కిక్కిచ్చే న్యూస్​
X
ఈ మధ్య కాలంలో బరువును తగ్గించుకొనేందుకు చాలా మంది కీటో డైట్​ను ఫాలో అవుతున్నారు. ఈ డైట్​ అనతికాలంలోనే సత్ఫలితాలు ఇవ్వడంతో కీటో డైట్​ చేసే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మన భాగ్యనగరంలో చాలా మంది బరువు తగ్గించుకొనేందుకు ఈ డైట్​ను ఫాలో అవుతున్నారు. అయితే బ్రెజిల్​ కు చెందిన ఓ యూనివర్సిటీ చేసిన ప్రయోగం కీటో డైట్​ చేసేవాళ్లకు మంచి కిక్కు నిచ్చే ఓ వార్తను మోసుకొచ్చింది. కీటోడైట్ ​తో బరువు తగ్గుతారని.. శరీరంలో అనవసరంగా పేరుకు పోయిన కొవ్వు ను తగ్గుతుందని మనకు తెలిసిన విషయమే..

అయితే తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఏం చెబుతుందంటే.. కీటో డైట్​ చేసేవాళ్లు బరువు తగ్గడంతోపాటు వాళ్లలో ​ స్పెర్మ్ కౌంట్​ (వీర్యకణాల సంఖ్య) , నాణ్యత పెరుగుతుందని.. వాళ్లు లైంగికంగా మరింత సామర్థ్యం సాధిస్తారని ఈ ​అధ్యయనం తేల్చిచెప్పింది. ఇటీవల బ్రెజిల్​కు చెందిన డీసావోపాలో అనే యూనివర్సిటీ కీటో డైట్​ పాటించే వాళ్లపై ఓ అధ్యయనం చేసింది. కీటో డైట్​ చేస్తున్న అనేకమందిని వారు ఈ సందర్భంగా పరీక్షించారు. ఈ అధ్యయనంలో ఊబకాయం ఉన్న పురుషుల్లో అనవసర కొవ్వు పోవడంతో పాటు వారి లైంగికసామర్థ్యం పెరిగినట్టు తేలింది. పలువురు కీటో డైట్​ పాటించేవాళ్లను ఈ వర్సిటీ అధ్యయనం చేయగా షాకింగ్​ నిజాలు వెలుగుచూశాయి..

కీటో డైట్ పాటించిన వారు మూడు నెలల్లో 27 కిలోల శరీర బరువును కోల్పోయారు. వారి శరీరంలోని కొవ్వుశాతం 42 నుంచి 34 శాతానికి పడిపోయింది. అయితే ఆశ్చర్యకరంగా వారి శరీరంలోని మోటెల్ స్పెర్మ్ శాతం నాణ్యత 100 శాతం మెరుగుపడింది. టెస్టోస్టెరాన్ స్థాయి కూడా అనేకరెట్లు పెరిగింది. అయితే రెండో దశలో కీటో డైట్​ తీసుకొనే వాళ్ల శరీరం లో కూడా మూడు నెలల్లో 9 కిలోల శరీర బరువును తక్కువైంది. శరీర కొవ్వు శాతం 26 నుంచి 21 శాతానికి పడిపోయింది. తుది పరీక్ష నమూనాలో 100 మిలియన్లకు పైగా స్పెర్మ్ పరీక్షించడం తో స్పెర్మ్ నాణ్యత కూడా మెరుగుపడింది. అయితే కీటో డైట్​ పాటించే వారితో పాటు చేపలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే స్పెర్మ్​ సంఖ్య పెరుగుతుందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.