Begin typing your search above and press return to search.
జవాన్లకు మరో శుభవార్త చెప్పనున్న మోడీ సర్కార్!
By: Tupaki Desk | 3 March 2020 12:15 PM ISTమన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరం ఊహించలేము. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలని ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం అర్థమౌతుంది. ఇకపోతే మోడీ పెళ్లిచేసుకున్న బ్రహ్మచారి. రికార్డ్స్ పరంగా మోడీ పెళ్లి చేసుకున్నా కూడా ..అయన బ్రహ్మచారే. ఆయనకి మద్దతుగా నిలిచే వారు మోడీ లోని గొప్ప గుణం ఇదే అంటు ప్రశంసలు కురిపిస్తే ..వ్యతిరేకవర్గం వారు ఇదే ఆయుధంగా ఆయనపై విమర్శలు కురిపిస్తుంటారు. అయితే ,ప్రధాని మోడీ బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ...దేశం కోసం ప్రాణాలని సైతం విడిచిపెట్టాడు క్షణం కూడా ఆలోచించకుండా , నిత్యం దేశ సేవలో మునిగిపోయే జవాన్లు తమ కుటుంబాలతో గడపడం, కాపురాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
జవాన్లు ఏళ్లకి ఏళ్లు , భార్య , పిల్లలు అనే బంధాలకి దూరంగా ఉంటూ దేశ రక్షణే లక్ష్యంగా విధి నిర్వహణలో మునిగిపోతారు. ఏడాది లో అతి కొద్ది రోజులు మాత్రం స్వగ్రామాలకు వెళ్లి .. కుటుంబంతో గడిపి మళ్లీ విధుల్లో బిజీగా మారుతుంటారు. భార్యా పిల్లలు, వారి జీవనగమనం, పిల్లల చదువులు వంటి విషయాలపై వారికీ దృష్టి పెట్టేంత సమయం కూడా ఉండదు. అయితే మోడీ సర్కారు ఈ విషయం లో కొన్ని మార్పులు చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. భద్రతా దళాల్లో పనిచేసే జవాన్లు ఏడాదిలో 100 రోజుల పాటూ కుటుంబంతో గడిపేలా ఒక కొత్త విధానం తీసుకు రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్నారట.
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తెలిపారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎన్ ఎస్ జీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ .. జవాన్లకు ఈ తీపి కబురు చెప్పారు. భద్రతా బలగాలు, సైనికులు, జవాన్లలో తమ క్రేజ్ పెంచుకునేలా మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకే పెన్షన్ విధానం కూడా ఇప్పుడు అమల్లోకి తీసుకువచ్చింది. వారి సంక్షేమంతో పాటూ.. మోడీ ప్రభుత్వ గైడెన్స్ లో రెండు దఫాలుగా జరిగిన సర్జికల్ దాడులు కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల జవాన్లకు అభిమానం పెంచుతాయి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే జవాన్లు లోటుగా ఫీల్ అయ్యే ..కుటుంబం తో గడిపే క్షణాలని పెంచితే కేంద్ర ప్రభుత్వం పట్ల జవాన్లకు మరింత అభిమానం పెరిగే అవకాశం ఉంది. అలాగే గతంలో కంటే ఏడాదికి జవాన్లకు 100 రోజులు సెలవులు ఇచ్చేలా మార్పులు తీసుకురావడం మరో గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం తో జవాన్లు మరింత దృఢ నిచ్ఛయం తో విధి నిర్వహణ లో పాల్గొంటారు.