Begin typing your search above and press return to search.

అదానీకి మోడీజీ ఇంకొక గిఫ్ట్ ఏమో?

By:  Tupaki Desk   |   22 March 2021 11:00 AM GMT
అదానీకి మోడీజీ ఇంకొక గిఫ్ట్ ఏమో?
X
ప్రైవేటీకరణ పేరుతో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని తెగనమ్ముతున్న మోడీ సర్కార్ కార్పొరేట్లకు దోచిపెడుతోందన్న అపవాదును మూటగట్టుకుంది. దానికి మరో ఉదాహరణ దేశ ప్రజల ముందుకు రావడం విశేషం.రైతుల నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్.సీ.ఐ) సేకరించిన ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే కాంట్రాక్ట్ ను మోడీ ప్రభుత్వం అదానీ కంపెనీకి గంపగుత్తగా అప్పజెప్పడం పెనుదుమారం రేపింది. ఏకంగా 30 ఏళ్ల పాటు ఒక్క అదానీ కంపెనీ మాత్రమే ఈ గోడౌన్లను నిర్వహించేలా కట్టబెట్టారు.

అంతేకాదు ఇందుకుగాను కరోనా కల్లోలంలోనూ అడ్వాన్స్ గా రూ.700 కోట్లను కూడా కేంద్రప్రభుత్వం విడుదల చేసి అదానీ కంపెనీపై అవాజ్య ప్రేమ చూపించింది.దీంతో ఎఫ్.సీ.ఐకి చెందిన 5.75 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలను అదానీ అగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ పంజాబ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, మహారాస్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నిర్వహించనుంది.

ఈ మేరకు తమతో మాత్రమే మోడీ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని అదానీ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది.ఇటీవలే ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరులను మించి అదానీ అత్యధిక సంపాదన పరుడుగా ఈ ఏడాదికి నిలిచాడు. మోడీ సర్కార్ తీరు చూస్తుంటే ఈయనే నంబర్ 1గా అవతరించే పరిస్థితి ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.