Begin typing your search above and press return to search.

కరోనా చికిత్సకు మరో ఔషధం రెడీ

By:  Tupaki Desk   |   7 Jun 2021 1:00 PM IST
కరోనా చికిత్సకు మరో ఔషధం రెడీ
X
కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ‘యాంటీ -హెల్మినిటిక్ ఔషధం ‘నిక్లోసమైడ్’ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. లాక్సాయ్ లైఫ్ సెన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సహకారంతో సీ.ఎస్.ఐ.ఆర్ ఇండియా రూపొందించింది.

ఆస్పత్రిలో చేరిన కరోనా రోగుల చికిత్స కోసం ఈ ‘నిక్లోసమైడ్’ ను ఉపయోగించనున్నారు. సమర్థత, భద్రతను అంచనావేయడానికి.. మల్టీ సెంట్రిక్, ఫేజ్2, రాండమైజ్డ్, ఓపెన్ లేబుల్ క్లినికల్ అధ్యయనంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టారు.

పెద్దవాళ్లలో, పిల్లల్లో చికిత్స కోసం నిక్లోసమైడ్ గతంలో విస్తృతంగా ఉపయోగించారు. ఇది బాగా పనిచేస్తుందని తేలడంతో కరోనా చికిత్సకు దీన్ని వాడేందుకు భారతీయ వైద్య పరిశోధన సంస్థ అనుమతించింది.

‘నిక్లోసమైడ్’ ఉపయోగించి రెండో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఎస్ఈసీ సిఫారసులపై సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మాండే హర్షం వ్యక్తం చేవారు. ఇది అందుబాటులో ధరలోనే ఉండే ఔషధం అని.. భారత్ కు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. మన జనాభాకు అందుబాటులో ఉంచవచ్చునని తెలిపారు.