Begin typing your search above and press return to search.

క‌రెన్సీ నోట్ల‌ విష‌యంలో ఆర్‌బీఐ మ‌రో నిర్ణ‌యం..?

By:  Tupaki Desk   |   26 Jan 2021 8:44 PM IST
క‌రెన్సీ నోట్ల‌ విష‌యంలో ఆర్‌బీఐ మ‌రో నిర్ణ‌యం..?
X
ఇది డిజిటల్ యుగం. అవ‌కాశం ఉన్న ప‌నుల‌న్నీ క్ర‌మంగా డిజిట‌లైజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో డిజిట‌ల్ క‌రెన్సీ కూడా చ‌ర్చలోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో వర్చువల్ క‌రెన్సీ, క్రిప్టో కరెన్సీల పేరిట నగదుకు ప్రత్యామ్నాయ రూపాలెన్నో ప్రజల ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కూడా డిజిటల్ కరెన్సీ అంశాన్ని పరిశీలిస్తోంది!

ప్రస్తుతం మనం ఉప‌యోగిస్తున్న క‌రెన్సీ (నాణేలు, నోట్లు)ని ఫియట్ కరెన్సీ అంటారు. ఈ క‌రెన్సీకి డిజిటల్ రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని రిజ‌ర్వు బ్యాంకు పరిశీలిస్తోంది. భారత్‌లో చెల్లింపుల వ్యవస్థ పేరిట ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది.

అయితే.. 'ఈ రకమైన కరెన్సీల వ‌ల్ల‌ వచ్చే ప్రమాదాల కారణంగా భారత ప్రభుత్వ వర్గాలు ఎప్పటినుంచో డిజిటల్ కరెన్సీవైపు మొగ్గు చూప‌లేదు. అయితే.. ''ప్రస్తుతమున్న ఫియట్ కరెన్సీని పోలిన డిజిటల్ కరెన్సీ అవసరం దేశంలో ఉందా..? ఇవి అవసరమే అనుకున్న పక్షంలో వీటిని ఎలా చెలామణిలోకి తేవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అని ఆర్‌బీఐ పేర్కొంది.

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా నగదు లావాదేవీల విషయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ చెల్లింపుల నుంచి ఏకంగా నగదుకు ప్రత్యామ్నాయంగా పలువురు భావిస్తున్న క్రిప్టో కరెన్సీ వరకూ అనేక వ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే డిజిటల్ కరెన్సీ తెరపైకి వచ్చింది. మ‌రి ఆర్‌బీఐ, కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాయ‌న్న‌ది చూడాలి.