Begin typing your search above and press return to search.

కరోనా పోకేముందే.. మరో మహమ్మారి ఎంట్రీ.. అది కూడా చైనా నుంచే..

By:  Tupaki Desk   |   6 Nov 2020 7:40 PM IST
కరోనా పోకేముందే.. మరో మహమ్మారి ఎంట్రీ.. అది కూడా చైనా నుంచే..
X
కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్నిదేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరికొన్ని దేశాల్లో సెకండ్​వేవ్​ ముంచుకొస్తున్నది. వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలో ఉంటే కరోనా పోకేముందే మరో మహమ్మారి సిద్ధంగా ఉన్నదని డబ్ల్యూహెచ్​వో హెచ్చరికలు జారిచేసింది. అది కూడా కరోనా లాగే చైనా లోని ఓ ల్యాబ్​లో పుట్టిందని సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 73వ వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ వర్చువల్ సెషన్‌లో భాగంగా ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెచ్ వో పిలుపునిచ్చింది.

ఈ విషయంలో వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ కోవిడ్‌-19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (2005)కు అనుకూలంగా ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తుంది అని తెలిపింది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా బయటపడిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ మహమ్మారి అదుపులోకి రాలేదు. ఇంతలోనే చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌలో 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్‌ ప్లాంట్‌ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్‌జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55,725కి పరీక్షలు చేశాం. వీరిలో 6,620 మందికి పాజిటివ్‌గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు.

బ్రూసెల్లోసిస్ లక్షణాలివే..

ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే ( దగ్గు, జలుబు, జ్వరం, వొల్లునొప్పులు) కనిపిస్తాయి. కలుషితమైన ఆహారపదార్థాలు, నీళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు.