Begin typing your search above and press return to search.

మళ్లీ వార్తల్లోకెక్కిన జుబ్లీహిల్స్ సొసైటీ వివాదం

By:  Tupaki Desk   |   19 Aug 2021 11:00 AM IST
మళ్లీ వార్తల్లోకెక్కిన  జుబ్లీహిల్స్ సొసైటీ వివాదం
X
జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో వ్యవహారాలు అదుపుతప్పి నడుస్తున్నాయి. అయితే ఈ సారి ఏకంగా తెలంగాణ హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్ పెట్టినట్టు అయింది. వెంటనే సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

అనేక ఆరోపణల నేేపథ్యంలో సొసైటీ పర్యవేక్షణకు, నియంత్రణకు స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. తెలంగాణా కోఆపరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రార్‌-కమ్‌-కమిషనర్‌ను ఆదేశించింది.. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి ఎ.మురళీముకుంద్‌ స్పెషలాఫీసర్‌ నియామకం కోరుతూ పిటిషన్‌ వేయడంతో హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా సెక్రటరీ అధికారాలను తొలగిస్తూ సొసైటీ ప్రసిడెంట్ ఈ నెల 12 న జారీ చేసిన నోటీసు ను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు.

అధ్యక్షుడికి నోటీసులు ..

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ సెక్రటరీని అడ్డుకోవదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ పై సొసైటీ ప్రెసిడెంట్‌కు నోటీసులు జారీచేసింది హైకోర్టు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ సెక్రటరీగా తన విధులను తాను నిర్వర్తించకుండా సొసైటీ ప్రెసిడెంట్‌ ఇతర పాలకవర్గ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ సొసైటీ సెక్రటరీ మురళీముకుంద్‌ వేసిన పిటిషన్‌ పై హైకోర్టు నోటీసులు జారీచేసింది.

మురళీముకుంద్‌ పిటిషన్‌ను పరిశీలించి ప్రతివాదులైన సహకారశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, సహకార సొసైటీల రిజిస్ట్రార్‌, జూబ్లీహిల్స్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ కు నోటీసులు జారీచేసింది. సొసైటీ సెక్రటరీగా తన హక్కులకు ప్రెసిడెంట్‌, ఇతర మేనేజింగ్‌ కమిటీ సభ్యులు భంగం కలిగిస్తున్నారని, మీటింగ్స్‌ కు కూడా రానివ్వడంలేదనీ, తన బాధ్యతలను నిర్వర్తించనివ్వడం లేదని పిటిషన్‌ లో మురళీ ముకుంద్‌ పేర్కొన్నారు. పిటిషనర్‌ అభ్యర్థించిన మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయని బెంచ్‌ పేర్కొంది.