Begin typing your search above and press return to search.
అర్నాబ్ పై మరో కేసు.. టార్గెట్ చేసిన మహా సీఎం!
By: Tupaki Desk | 5 Nov 2020 9:45 AM ISTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది రిపబ్లిక్ టీవీ, ఆ చానెల్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అన్నసంగతి అందరికీ తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగా ఉండే రిపబ్లిక్ టీవీ కథనాలపై అప్పట్లో మహారాష్ట్రలోని ఉద్దవ్ సర్కార్ మంత్రులు, ఆ పార్టీ నేతలు పలు వేదికల్లో ఆరోపణలు చేశారు.. ఇప్పుడు సమయం చూసి అర్నాబ్ ను దెబ్బకొట్టారన్న చర్చ ముంబై రాజకీయవర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో సాగుతోంది.
ఇప్పటికే పాత కేసును తిరగదోడి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని నిన్న మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి కేంద్రమంత్రులంతా ఖండించి ఇది మీడియాపై దాడి అన్నారు.
తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ మరో కేసు పెట్టి అర్నాబ్ కు ఉచ్చు బిగించాడని ప్రచారం సాగుతోంది.. నిన్న రాత్రి ముంబై పోలీసులు అర్నాబ్ గోస్వామితోపాటు ఆయన భార్య, కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు భంగం కలిగించారని, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అరెస్ట్ ను అడ్డుకోవడం.. మమిళా పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ముంబైకి చెందిన ఎన్ఎం జోషి మార్గ్ పీఎస్ లో ఈ కేసు నమోదైంది.
ఇప్పటికే 2018లో 5 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు అర్నాబ్ గోస్వామే కారణంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అర్నాబ్ గోస్వామిని ముంబై నివాసం నుంచి రాయ్గడ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాయ్‌గడ్ పోలీసులకు వ్యతిరేకంగా మానవ హక్కులను రిపబ్లిక్ టీవీ ముంబై ఆశ్రయించింది. అర్నాబ్ గోస్వామిపై పోలీసులు దాడి చేశారని, చట్ట విరుద్ధంగా వ్యవహరించారని జాతీయ మానవ హక్కుల సంఘంతోపాటు మహారాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.