Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి మరో గట్టి షాక్

By:  Tupaki Desk   |   17 Nov 2020 9:00 PM IST
రేవంత్ రెడ్డికి మరో గట్టి షాక్
X
దుబ్బాక గెలుపుతో జోష్ మీద ఉన్న బీజేపీ ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను మరింత దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే క్రమంలో అధికార టీఆర్ఎస్ లోని అసంతృప్తులకు గాలం వేస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ పెద్దలు పడ్డారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ భారీగా వలసలు ప్రోత్సహిస్తున్నారు.

దుబ్బాక విజయంతో ఇప్పుడు బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. చోటామోటా నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. మరింత మంది స్థానిక నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది.

తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీలో చేరారు. ఆయన చేరిన వెంటనే కొప్పులకు ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి మరో ముఖ్య అనుచరుడు కాసం రామ్ రెడ్డి సైతం ఈరోజు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈయన గడ్డి అన్నారం టికెట్ ఆశిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి ఈ వలసను ప్రోత్సహిస్తూ వారికి కండువా కప్పి బీజేపీలో చేర్చుకుంటున్నారు.