Begin typing your search above and press return to search.

కరోనా లాక్‌ డౌన్‌ తో కలిగిన మరో ప్రయోజనం

By:  Tupaki Desk   |   31 March 2020 3:30 AM GMT
కరోనా లాక్‌ డౌన్‌ తో కలిగిన మరో ప్రయోజనం
X
దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని తెలిసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు వారాల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించిన మోడీ చర్యను ప్రపంచ దేశాలు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందిస్తుంది. ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించకుండా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని అరికట్టడం తో పాటు మరికొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

లాక్‌ డౌన్‌ తో కుటుంబ సభ్యులు అంతా ఒక్క చోట చేరుతున్నారు. ఎప్పుడు బిజీగా జీవితాన్ని గడిపే జనాలు ఈ లాక్‌ డౌన్‌ పుణ్యమా అని కుటుంబ సభ్యుల తో గడుపుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం.. కొత్త కొత్త పనులు నేర్చుకుంటున్నాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతున్నారు. ఈ సమయంలోనే దేశంలోని మెట్రో నగరాలకు లాక్‌ డౌన్‌ వరంగా మారిందంటూ పర్యావరణ నిపుణులు అంటున్నారు.

దేశ రాజధాని దిల్లీతో పాటు బెంగళూరు.. ముంబయి.. హైదరాబాద్‌.. కోల్‌కత్తా వంటి నగరాల్లో కాలుష్యం ప్రమాధకర స్థాయిలో పెరిగి పోయింది. ఆమద్య దిల్లీ రోడ్లపై మాస్క్‌ లేకుండా మూడు గంటలు తిరిగితే మృతి చెందడం ఖాయం అంటూ వాతావణ నిపుణులు హెచ్చరించారు. అంతగా కాలుష్యం దిల్లీలో విజృంభించింది. లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని బంద్‌ అయ్యాయి. ఫ్యాక్టరీలు వాహనాలు అన్ని కూడా నిలిచి పోవడంతో వాతావరణం పూర్తిగా అదుపులోకి వచ్చిందట.

మొన్నటి వరకు గాలిలో కాలుష్యం 150 నుండి 200 శాతం ఉండగా ప్రస్తుతం అది 60 లోపుకు చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లాక్‌ డౌన్‌ పూర్తి అయ్యేప్పటి వరకు కాలుష్యం శాతం మరింతగా తగ్గుతుందని పర్యావణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రాణ భయంను కలిగిస్తున్నా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నా కూడా కొన్ని విషయాల్లో మాత్రం మంచే చేస్తుందని అల్ప సంతోషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.