Begin typing your search above and press return to search.
యూపీలో మరో దారుణం ..క్యాంపస్ లో 12 మంది కలిసి విద్యార్థిని అత్యాచారం
By: Tupaki Desk | 12 Oct 2020 8:00 PM ISTదేశంలో రోజురోజుకి మహిళలపై జరిగే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఈమద్యే యూపీలో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్ లో సామూహిక హత్యాచార ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోన్న సమయంలో బాలికలపై ,మహిళలపై పలు రాష్ట్రాలలో లైంగిక దాడులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా యూపీలోని ఝాన్సీలో పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ సర్వీసు పరీక్షలు జరుగుతున్న ప్రదేశంలో పోలీసు భద్రత ఉన్నప్పటికీ 17 ఏళ్ల యువతిపై కొంతమంది కలిసి అత్యాచారం చేశారు.
యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటుగా, అభ్యంతరకరమైన వీడియోలను తీసి హింసకు గురి చేశారు కొందరు కామాంధులు. కళాశాలలోనే వెలుగు చూసిన ఈ దారుణం యూపీలో సంచలనంగా మారింది. అక్టోబర్ 11వ తేదీన ఆదివారం పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ సర్వీస్ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసుల భారీ భద్రత కూడా ఉంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోవడానికి వెళ్లిన ఆమెను సుమారు 12 మంది విద్యార్థులు బలవంతంగా లాక్కుపోయారు. ఆమె బాయ్ ఫ్రెండును కొట్టారు. వారిలోఒకడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడగా ఇతర విద్యార్థులు వీడియో తీశారు. కాలేజీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘోరం జరిగింది. బాధితురాలి పోలీసులకి ఫిర్యాదు చేసింది.
కళాశాల క్యాంపస్ సమీపంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బాలిక కేకలు విని , అక్కడికి వెళ్లడంతోఈ విషయం బయటపడింది. నిందితుల్లో ఒకరిని భరత్ అనే వ్యక్తి గా గుర్తించామని, నిందితులంతా పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు హాస్టల్ లో ఉండేవారా , కాదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశామని, వారిపై ఐపీసీ సెక్షన్ 120 బి , 376 డి , 395, 386, 323, సెక్షన్ 66 డి ఐటీ చట్టం క్రింద, పోక్సో చట్టం లోని సెక్షన్ 3/4 క్రింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.