Begin typing your search above and press return to search.
భూమి లాంటి గ్రహాలు మరో 24.. ఇక ఎగిరి వెళ్లిపోవడమేనా!
By: Tupaki Desk | 9 Oct 2020 5:00 AM ISTఅంగారకుడిమీద నీటి జాడలు కనిపించాయి. చంద్రుడి మీద మనం నివసించవచ్చు.. అంతరిక్షంలో రెస్టారెంట్లు కట్టవచ్చు.. అనే వార్తలు ఇప్పటివరకు చాలా విన్నాం. కానీ ఇతర గ్రహాల్లో నివసించవచ్చా.. అక్కడ నివాసయోగ్యంగా ఉంటుందా? అన్న విషయంపై చాలా కాలంగా శాస్త్రీయ ఆధారాలు లేవు. చంద్రుడి మీద కొంతప్రాంతం నివాసయోగ్యం ఉందని.. అమెరికా అక్కడికెళ్లి వెంచర్లు ఏర్పాటు చేయబోతున్నదని కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. ఇతర గ్రహాల్లో నివసించడం.. ఇప్పటివరకు మనం సినిమాల్లో, నవలల్లో మాత్రమే చదివాము. కానీ అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ మాత్రం ఈ విషయంపై కొంత లోతైన పరిశోధన చేసింది. మానవాళి నివసించడానికి భూమికాకుండా మరో 24 గ్రహాలు ఉన్నట్టు వర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డిర్క్ షుల్జే మాకుచ్ ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. అంతేకాకుండా ఈ పరిశోధనలకు సంబంధించిన పలు అధ్యయనాలు ఆస్ట్రోబయాలజీ జర్నల్ లో కూడా ప్రచురితం అయ్యాయి.
ఈ 24 గ్రహాల్లో మనుషులు, ఇతర జీవరాశులు ఉండొచ్చని.. అంతే కాకుండా ఈ గ్రహాలు వేల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అక్కడ వాతావరణం భూమికంటే కొంచెం వేడిగా ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. తేమ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. వీటిలో కొన్ని గ్రహాల కక్ష్యలోని నక్షత్రాలు మన భూమి కంటే బాగా ఉన్నట్టు పేర్కొన్నారు. వీటిపై జీవం సులభంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 24 గ్రహాలు 100 కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్నట్టు షుల్జే మాకుచ్ తెలిపారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలి స్కోప్, లువియర్ స్పేస్ అబ్జర్వేటరీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్లేటో స్పేస్ టెలిస్కోప్ వంటివి భవిష్యత్తు పరిశీలనకు తమ పరిశోధన ఎంతో ఉపయోగ పడుతుందని షుల్జే పేర్కొన్నారు. అయితే భవిష్యత్ లో అక్కడ మరిన్ని పరిశోధనలు చేస్తారేమో వేచిచూడాలి.