Begin typing your search above and press return to search.

టీడీపీ 219 జంబో కమిటీలో అనామకులు

By:  Tupaki Desk   |   6 Nov 2020 8:20 PM IST
టీడీపీ 219 జంబో కమిటీలో అనామకులు
X
మునుపెన్నుడూ లేనట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా జంబో కమిటీని ఏర్పాటు చేశాడు. ఇప్పటికే నియోజకవర్గ, పార్లమెంట్ కమిటీలను ఏర్పాటు చేసిన చంద్రబాబు తాజాగా మరింత మందికి అవకాశం కల్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, ఐదారుగురు జాతీయ ఉపాధ్యక్షులు, మరో ఆరుగురు జాతీయ కార్యదర్శులు ఇలా టీడీపీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియామకాలు చేపట్టారు

అప్పట్లో భారీగానే నియామకాలు చేసినా కొంతమందికి పదవులు దక్కలేదు. తాజాగా వారిందరినీ ముక్కు మొహం తెలియని వారిని.. అనామకులను కూడా పార్టీలో చోటు కల్పించారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

ఇదివరకు ప్రకటించిన 60 మందితో కలిపి తాజాగా జంబో కమిటీ ఏర్పాటైంది. మొత్తం 300 మందికి చంద్రబాబు పార్టీలో పదవులు పంచేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 300 పదవులు ఇవ్వడం చంద్రబాబుకే చెల్లిందంటున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా లేనివారికి..జనాల్లో కనిపించని వారికి సైతం టీడీపీలో ఉపాధ్యక్షులుగా నియమించారన్న ప్రచారం సాగుతోంది. తొలి నియామకాల్లో బాబు వదిలేసిన అఖిలప్రియ, సుజయ రంగారావులకు ఈ జంబో కమిటీలో స్థానం కల్పించడం విశేషం.

* 219 మందితో టీడీపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 219 మందితో కొత్త కమిటీని నియమించింది. ఇందులో 18 మందికి ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. మరో 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. బడుగు బలహీన వర్గాలకు 61 శాతం పదువులు ఇచ్చారు. 50 ఉపకూలాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, ఎస్టీలకు 3 శాతం మందికి బాధ్యతలు అప్పగించారు. మైనార్టీలకు 6 శాతం కొత్త కమిటీలో చోటు కల్పించారు. అలాగే రాష్ట్ర కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.