Begin typing your search above and press return to search.
సీఎం అభ్యర్థిని ప్రకటించిన అన్నాడీఎంకే
By: Tupaki Desk | 7 Oct 2020 5:20 PM ISTఅసలు అన్నాడీఎంకే మరోసారి గెలుస్తుందన్న దానిపై ఎవరికి అంచనాలు లేవు. ఇప్పటికే అమ్మ జయలలిత వల్ల రెండు సార్లు గెలిచిన అన్నాడీఎంకే ఇప్పుడు తమిళనాట పాలిస్తోంది. అమ్మమరణం తర్వాత ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ లేకుండా పోయారు. మరోవైపు డీఎంకే స్టాలిన్ ఈసారి సీఎం కావడం ఖాయమని.. ఆ పార్టీదే గెలుపు అని అంటున్నారు.
అయితే అన్నాడీఎంకేలో మాత్రం ఆశ చావడం లేదు. తాజాగా ఆ పార్టీలో ఎన్నికల తర్వాత ఎవరు సీఎం అన్న పంచాయితీ మొదలైంది. పార్టీ కార్యవర్గ సమావేశం ముందు వరకు సీఎం పోస్ట్ నాకే కావాలంటూ యాగీ చేసిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.. తాజాగా అనూహ్యంగా వెనక్కితగ్గారు.
ఈ సమావేశం ప్రారంభమైన కాసేపటికే రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే తరుఫున సీఎం అభ్యర్థిని ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు మరోసారి సీఎం అభ్యర్థిగా ఫళని స్వామినే ప్రకటించింది స్టీరింగ్ కమిటీ.
మొత్తం 11 మందితో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీలో ఆరుగురు ఫళని స్వామికి మద్దతు తెలుపుగా.. ఐదుగురు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చారు. అనంతరం పన్నీర్ సెల్వంకు పార్టీ వ్యవహారాల బాధ్యతలు కట్టబెట్టారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై వారిద్దరూ సంతకాలు చేశారు.
కాగా సమావేశం అనంతరం పన్నీర్, ఫళని ఒకరినొకరు సన్మానించుకొని విభేదాలకు స్వస్తి పలికి ఐక్యంగా ఎన్నికలు ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం ముగిసిపోయింది.