Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి అంధకారమేనా?

By:  Tupaki Desk   |   18 Sep 2017 5:36 PM GMT
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి అంధకారమేనా?
X
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అనూహ్య సంచలనం. నిన్నటి దాకా జనసేన పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న గిద్దలూరు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు మార్కాపురం కోర్ట్ ఒక ల్యాండ్ ఇష్యూ కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. 8 ఏళ్ల క్రితం అంటే 2008లో గోళ్ళ సురేంద్రనాథ్ అనే వ్యక్తికి - రాంబాబుకి భూ తగాదా వచ్చింది. నరేంద్రనాథ్ భార్య ఈ విషయంగా కోర్ట్ ని ఆశ్రయించడంతో ఇన్నేళ్ల విచారణ తరువాత నేరం ఋజువయ్యింది. రాంబాబు వెంటనే బెయిలు తీసుకున్నప్పటికీ పై కోర్టుకు వెళ్ళడానికి అక్టోబర్ 13 వరకే అవకాశం ఇచ్చింది. లేదంటే శిక్షకు కట్టుబడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం జరిగాక టిడిపిలోకి వచ్చి ఓటమి చవిచూసాడు.

తీర్పు రావడానికంటే ముందు వరకు జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న అన్నా రాంబాబుకు ఇది చిన్న దెబ్బ కాదు. అప్పీలుకి వెళ్లినా కూడా కింద కోర్టులో నేరం నిరూపితం అయ్యింది కాబట్టి క్లీన్ చిట్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఇంతకు ముందే రాంబాబు టికెట్ విషయమై పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినట్టు అనుచరుల్లో బలమైన చర్చ ఇప్పటికే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా సంస్థాగతంగా కూడా బలంగా లేని తన పార్టీలోకి రాంబాబుని పవన్ రానిస్తాడా అనే అనుమానం బలపడుతోంది. ఊహించని విధంగా తీర్పు రావడంతో అన్నా రాంబాబుపై ఏ పార్టీ సానుభూతి చూపించినా అది వాళ్ళకే నష్టం కాబట్టి ఈయన పరిస్థితి అధోగతే అనే కామెంట్స్ వినపడుతున్నాయి. కోర్టుల వ్యవహారం అంత సులువుగా తేలేది కాదు కాబట్టి అన్నా రాంబాబు ఇందులో బయట పడటం ఏమో కాని రాజకీయ భవిష్యత్తుని మాత్రం అంధకారంలో పడేసుకున్నాడు అనేది మాత్రం నిజం.