Begin typing your search above and press return to search.

కెనాడాలో ఆ రాష్ట్ర సీఎం రేసులో మనమ్మాయ్

By:  Tupaki Desk   |   3 Sept 2022 10:46 AM IST
కెనాడాలో ఆ రాష్ట్ర సీఎం రేసులో మనమ్మాయ్
X
దేశం ఏదైనా కానీ.. రంగం మరేదైనా కానీ భారతీయులు.. భారత మూలాలున్న వారు తమ సత్తా చాటే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఓపక్క బ్రిటన్ ప్రధాని రేసులో మనోడు రిషి సునాక్ ఉండటం తెలిసిందే. కడపటి వార్తల ప్రకారం ఎన్నికల పోలింగ్ వేళ నిర్వహించిన సర్వేలు.. ఆయన వెనుకబడినట్లుగా చెబుతున్నా.. ఇంత పెద్ద ఎత్తున పోటీని ఇవ్వటం కచ్ఛితంగా అతగాడి సామర్థ్యమే ప్రధాన కారణంగా చెప్పాలి.

రిషి ఎపిసోడ్ ఇలా ఉంటే.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. అదేమంటే.. కెనడా దేశంలోని కొలంబియా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తమిళనాడు ప్రాంతానికి చెందిన అంజలి అప్పాదురై పోటీలో నిలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో పుట్టి పెరిగిన అంజలి తన ఆరేళ్ల వయసులో కెనడాకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె వయసు 33 ఏళ్లుగా చెబుతారు. అనూహ్యంగా సీఎం రేసులోకి వచ్చిన ఆమె తీరు ఆసక్తికరంగా మారింది.

కొలంబియా రాష్ట్రానికి 2017లో ఎన్నికలు జరగటం.. అందులో న్యూ డెమొక్రటిక్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రాధినేతగా జాన్ హోర్గన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. గొంతు క్యాన్సర్ నేపథ్యంలో పార్టీ నాయకత్వం నుంచి రాష్ట్రాధినేత పదవినుంచి తప్పుకున్నారు. ఈ నేపథక్యంలో పార్టీ అధ్యక్ష పదవితో పాటు.. కొలంబియా రాష్ట్రాధినేత స్థానానికి ఆమె పోటీ పడుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా రాష్ట్ర న్యాయశాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న డేవిడ్ ఏబీ బరిలో ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా బరిలో ఉన్న అంజలి.. గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఏడాది నవంబరు 13న అంతర్గత ఎన్నికలు ప్రారంభమై.. డిసెంబరు 3న తుది ఫలితాలు వెల్లడవుతాయి. తమిళనాడులోని మధురై ప్రాంతంలో పుట్టిన అంజలి చిన్నతనంలో అక్కడే ఉన్నారు. ఆమెకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు కెనడాకు వలస వెల్లారు.

ప్రస్తుతం ఆమె కోక్ విల్టమ్ సిటీలో ఉంటున్నారు. రాజకీయ నేతగా.. సోషల్ యాక్టివిస్టుగా ఆమెకు మంచి పేరుంది. మరి.. కొలంబియా రాష్ట్రాధినేతగా ఆమె సుపరిచితురాలు. మరి.. ఆమె కోరుకుంటున్నట్లుగా కొలంబియా రాష్ట్రాధినేతగా అవతరిస్తారో లేదన్నది తేలాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.