Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ నువ్వు వెళ్లి ఇక సినిమాలు చేసుకో

By:  Tupaki Desk   |   5 Nov 2019 5:32 AM GMT
పవన్ కళ్యాణ్ నువ్వు వెళ్లి ఇక సినిమాలు చేసుకో
X
రాజకీయాలలో ఏ మాట మాట్లాడినా కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతె ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మాటలే ప్రత్యర్దులకి అస్త్రాలుగా మారి మనమే వారికీ లేని పోనీ ఐడియా లు ఇచ్చినట్టు అవుతుంది. మామూలుగానే విమర్శలతో హోరెత్తించే ప్రత్యర్థులు ..ఇక వారి చేతికి మనమే బలమైన ఆయుధం ఇస్తే ఇంకేమైనా ఉందా .. రచ్చ రచ్చే.. ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో .. ఇంకెవరు మన పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

లేడి కి లేచిందే పయనం అన్నట్టు ... పవర్ స్టార్ ఎప్పుడు నిద్ర మత్తులో నుండి బయటకి వస్తే అప్పుడు మైక్ తీసుకోని తెగ ఆవేశం తో ఊగిపోతారు. అదేంటో మరి రాష్ట్రము పై ఆయనకి మాత్రమే ప్రేమ ఉన్నట్టు ..ఆ విషయం కాసేపు పక్కన పెడితే పవన్ స్క్రిప్ట్ చదువుతాడు అని మరో సారి రుజువైంది. రాజకీయ నేతలు ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు వెనుకా ముందు అలోచించి మాట్లాడాలి. లేకపోతె రాజకీయాలలో ఎక్కువ కాలం కొనసాగలేరు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి ఇంకా అర్థం అయినట్టు లేదు. మైక్ తీసుకోగానే సినిమా ఫంక్షన్ అయినట్టు .. ఉగిపోతాడు. దీనితో లేని పోనీ సమస్యలలో ఇరుక్కుపోతాడు. పవన్ కళ్యాణ్ ఈ మద్యే విశాఖలో ఇసుక కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేసారు. అంతవరకూ బాగానే ఉంది .. కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేస్తున్నా అంటూ వైసీపీ వారి పై రెచ్చిపోయాడు. ఈ సమయంలో పవన్ మాట్లాడుతూ .. జగన్ రాష్ట్రాన్ని సరిగ్గా పాలిస్తుంటే నేను సినిమాలు చేసుకుంటా అని మాట్లాడారు. అది సందర్భాన్ని బట్టి ఆలా అన్నాడో లేక ఎదో మాటల్లో పడి అసలు విషయం మరచిపోయి అన్నాడో కానీ , అదే ఇప్పుడు వైసీపీ వారికీ అస్త్రం గా మారింది.

తాజాగా పవన్ పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ పవన్‌కల్యాణ్‌ ఇక సినిమాలు చేసుకోవచ్చు అని తెలిపారు. నెల్లూరు నగరంలోని కోనేటిమిట్టలో సోమవారం పర్యటించిన మంత్రి.. ఆదివారం విశాఖలో జరిగిన లాంగ్‌మార్చ్‌.. ఆ సందర్భంగా పవన్‌ చేసిన వ్యాఖ్యల పై స్పందించారు. ప్రస్తుతం పవన్‌ పింక్‌ అనే రీమేక్‌ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయని.. దీనిని బట్టి చూస్తే వైఎస్‌ జగన్‌ పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లేనన్నారు. ఇసుక పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం పై మంత్రి మండిపడ్డారు. త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయని తెలిపారు.