Begin typing your search above and press return to search.

అనిల్ అంబానీ ఏపీ వ‌చ్చింది ఎందుకు?

By:  Tupaki Desk   |   26 Dec 2015 4:10 PM GMT
అనిల్ అంబానీ ఏపీ వ‌చ్చింది ఎందుకు?
X
రిల‌య‌న్స్ అనిల్ దీరుభాయ్ అంబానీ గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అంబానీ రాష్ర్ట ప‌ర్య‌ట‌న అధికార‌, పారిశ్రామిక‌వ‌ర్గాల్లో ఆస‌క్తి రేకెత్తించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో అనిల్ అంబానీ భేటీ అయ్యారు. ఈ భేటీ గురించిన వివ‌రాల‌ను అటు రాష్ర్ట ప్ర‌భుత్వం కానీ, ఇటు రిల‌య‌న్స్ కానీ వెల్ల‌డించ‌లేదు. ఈ స‌మావేశంలో వీరిరువురి మధ్యా రాష్ట్రంలో 4జీ సేవలపై చర్చించినట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా రిల‌య‌న్స్ 4జీ సేవ‌ల‌ను విస్త‌రించేందుకు ఇప్ప‌టికే రిల‌య‌న్స్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. గ‌త ఏడాది చంద్ర‌బాబుతో జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిగాయి. విద్యుత్, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనిల్ అంబానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆక‌ర్ష‌నీయ‌ పారిశ్రామిక విధానాన్ని అండ‌గా తీసుకొని న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి తోడ్పాటు అందించాల‌ని చంద్ర‌బాబు కోరారు. ఈ క్ర‌మంలో అనిల్ అంబానీ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. తాజా భేటీలో ఈ విష‌యం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నారు.