Begin typing your search above and press return to search.

అంబానీకి షాక్.. ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధం!

By:  Tupaki Desk   |   2 Nov 2020 6:20 PM GMT
అంబానీకి షాక్.. ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధం!
X
ధీరుబాయ్ అంబానీ ఉన్నప్పుడు దేశంలోనే ఆయన కుమారులు అత్యంత సంపన్నులుగా ఉండేవారు. తండ్రి మరణం తర్వాత కుమారులు ఇద్దరూ రిలయన్స్ ను పంచుకున్నారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు విడిపోయి వ్యాపారాలు పంచుకొని వేరు వేరు మార్గాల్లో వెళ్లారు. కట్ చేస్తే అన్న ముఖేష్ దేశంలోనే సంపన్నుడిగా ఎదగగా.. అప్పులతో తమ్ముడు అనిల్ అంబానీ ఇప్పుడు దివాలా తీశాడు.

అప్పుల కుప్పలు చేసి దివాలా తీసిన అనిల్ అంబానీకి తాజాగా మరో షాక్ తగిలింది. అనిల్ అంబానీ చేసిన రుణ బకాయిలను రాబట్టడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ మేరకు అనిల్ అంబానీ ఆస్తుల అమ్మకానికి రెడీ అయ్యాయి. ఇది అనిల్ అంబానీకి ఘోర అవమానంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

అనిల్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సీఎల్)’ ఆస్తుల విక్రయానికి బ్యాంకులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న వారి నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్‌ 1 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో ఆర్‌సిఎల్ వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం విక్రయించనుంది

అనిల్ అంబానీ నుంచి దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించామని సీఎన్.బీసీ నివేదించింది. కాగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి.