Begin typing your search above and press return to search.

ఫ్లైట్ లో సీటు దొరకలేదన్న కోపంతో బాంబు వార్నింగ్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   29 March 2021 9:30 AM GMT
ఫ్లైట్ లో సీటు దొరకలేదన్న కోపంతో బాంబు వార్నింగ్ ఇచ్చాడు
X
కోపంతో చేసే పనులు నెత్తి మీదకు తీసుకురావటమే కాదు.. దిద్దుకోలేని తప్పులు చేసేలా చేస్తాయి. విచక్షణ మిస్ అయితే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. గర్భవతి అయిన భార్యను చూసేందుకు బయలుదేరిన కాకినాడ కుర్రాడు.. కోపంతో చేసిన పనికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇంతకూ జరిగిందేమంటే.. కాకినాడకు చెందిన వీరేశ్ అనే 33 ఏళ్ల కుర్రాడు నాసిక్ లో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 8.25 గంటలకు హైదరాబాద్ కు వెళ్లే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు.

అయితే.. అతగాడి టికెట్ పీఎన్ఆర్ నెంబరు అప్డేట్ కాలేదు. దీంతో.. ఎయిర్ పోర్టులుకు వెళ్లిన అతను.. ప్రయాణించటానికి వీల్లేదంటూ సిబ్బంది సూచించి.. మరో టికెట్ తీసుకోవాలని కోరారు. తన భార్య గర్భవతి అని..తాను వెంటనే వెళ్లాలని చెప్పినా.. ఏమీ చేయలేమని విమాన సిబ్బంది చెప్పటంతో కోపంతో రగిలిపోయాడు. ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి బయలుదేరి అతను.. విమానం బయలుదేరటానికి 20 నిమిషాల ముందు నాసిక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి.. విమానంలో బాంబు పెట్టినట్లుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు.

దీంతో కంగారు పడిన పోలీసులు.. ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు. దీంతో.. ప్రయాణికుల్ని వెంటనే విమానం నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అయినా బాంబు జాడ దొరకలేదు. దీంతో..పోలీసులకు సమాచారం అందించిన ఫోన్ నెంబరు తీగ లాగితే.. వీరశ్ బొమ్మబయటకు వచ్చింది.విమానంలో తనను ప్రయాణించేందుకు అనుమతించని కోపంతో అలా బెదిరింపులకు దిగినట్లుగా తప్పు ఒప్పుకున్నాడు. గర్భవతిగా ఉన్న భార్యను చూసేందుక తపించి.. ఆగ్రహంతో లేని పోనితిప్పలు తెచ్చి పెట్టుకున్న అతడు ఇప్పుడు రిమాండ్ లో జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఆవేశం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.