Begin typing your search above and press return to search.

బెట్టింగ్ కాసి అడ్డంగా బుక్ అయ్యింది

By:  Tupaki Desk   |   23 Dec 2015 11:14 AM IST
బెట్టింగ్ కాసి అడ్డంగా బుక్ అయ్యింది
X
సరదా మంచిదే. కానీ.. అది హద్దుల్లో ఉండాలి. సరదాకి చట్టబద్ధత కూడా అవసరం. లేకుండా ఎంత నష్టం పోవాల్సి వస్తోందో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఉదంతం చూస్తే అర్థమవుతుంది. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఉంటారన్న విషయాన్ని సరదాగా బెట్టింగ్ చేసిందో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్.

ఆస్ట్రేలియా బౌలర్ ఏంజెలా రీక్స్ కాసిన బెట్టింగ్ వ్యవహారం బయటకు రావటంతో ఆమెపై రెండేళ్ల నిషేధాన్ని విధించారు. ఇంతకీ అమ్మడు సరదాగా కాసిన బెట్టింగ్ మొత్తం మన రూపాయిల్లో చెబితే కేవలం రూ.432 మాత్రమే. అయితే.. నేర తీవ్రత.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంలో అమ్మడు ప్రదర్శించిన అత్యుత్సాహం ఆమెపై వేటు వేసేలా చేసింది.

ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల ప్రకారం ఎలైట్ గ్రూప్ లో ఉన్న గుర్తింపు కలిగిన క్రికెటర్లు ఎవరూ బెట్టింగులకు పాల్పడకూడదు. నిజానికి బెట్టింగ్ సంగతి తర్వాత.. బెట్టింగ్ కు వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ.. ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకొని.. అత్యుత్సాహంతో సరదాగా చేసిన పని.. ఆమె కెరీర్ ను నావనం చేసిందన్న అభిప్రాయాన్ని క్రీడా ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు.