Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త మృతి !
By: Tupaki Desk | 10 Feb 2021 4:00 PM ISTఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కరోనా వ్యాక్సిన్ వేసుకున్న అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్త సుశీల మృతి చెందింది. నాలుగు రోజుల ఆమె వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె అస్వస్థతకు గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకి తరలించారు. ఇవాళ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
వివరాల్లోకి వెళ్తే .. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తుంది. గడిచిన పది రోజుల క్రితం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాలు వేశారు. నాలుగు రోజుల క్రితం అంగన్ వాడీ టీచర్ చిన్ని కరోనా టీకా వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేసి పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందింది. టీకా వికటించడం వల్లే చిన్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.అయితే దీనిపై ఇంకా వైద్య అధికారులు స్పందించలేదు.